Balakrishna : హ‌మ్మ‌య్య బాల‌య్య త‌న‌యుడు సంద‌డికి సిద్ధ‌మైంది.. టైటిల్ కూడా క‌న్‌ఫాం చేశారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Balakrishna : హ‌మ్మ‌య్య బాల‌య్య త‌న‌యుడు సంద‌డికి సిద్ధ‌మైంది.. టైటిల్ కూడా క‌న్‌ఫాం చేశారా..!

 Authored By sandeep | The Telugu News | Updated on :5 September 2022,11:30 am

Balakrishna : ఇప్ప‌టికే టాలీవుడ్ సినీ ప‌రిశ్ర‌మ‌లో వారసుల హంగామా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. బాల‌కృష్ణ వార‌సుడు ఎప్ప‌టి నుండో వెండితెర ఆరంగేట్రం చేయ‌బోతున్నాడ‌ని వార్త‌లు వ‌స్తున్నా కూడా ఇంతవ‌ర‌కు క‌న్‌ఫాం కాలేదు. బాలకృష్ణ మాత్రం ఈ తరం హీరోలకు సైతం గట్టిపోటీ ఇస్తూ వరుస సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా అఖండ చిత్రంతో ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. అప్పుడు …ఇప్పుడు అంటున్నా ఇప్పటికీ ఓ క్లారిటీ రాకపోవడం కాస్త నిరాశ నింపుతోంది.

Balakrishna : క‌న్‌ఫాం అయిన‌ట్టేనా?

అప్ప‌ట్లో బాలయ్య వందో సినిమా `గౌతమీపుత్ర శాతకర్ణి`లో మోక్షజ్ఞ నటిస్తాడన్న ప్రచారం జరిగింది. ఆ తర్వాత మోక్షజ్ఞ డెబ్యూ సినిమా కోసం కొరటాల శివ, క్రిష్, బోయపాటి శ్రీను, రాజమౌళి లాంటి టాప్ దర్శకుల పేర్లు కూడా వినిపించాయి.కొన్ని రోజుల క్రితం మోక్ష‌జ్ఞ‌ నటనలో శిక్షణతో పాటు డాన్సులు, ఫైట్లు నేర్చుకుంటున్నాడని ప్ర‌చారం జ‌రిగింది. కాని ప్ర‌చారాలు ప్ర‌చారాలుగానే మిగిలిపోయాయి. అయితే నాని `శ్యామ్‌ సింగరాయ్‌` సినిమాకి దర్శకత్వం వహించిన రాహుల్ సంకృత్యాన్ బాల‌య్య త‌న‌యుడి డెబ్యూ సినిమాకి దర్శకత్వం వహిస్తాడని తెలుస్తోంది.

balakrishna son debut movie time fixed with rajamouli

balakrishna son debut movie time fixed with rajamouli

వారాహి చలన చిత్రం బ్యాన‌ర్ పై బాలయ్యకు, రాజమౌళికి అత్యంత సన్నిహితుడు అయినా సాయి కొర్రపాటి మోక్షజ్ఞ డెబ్యూ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించేందుకు రెడీగా ఉన్నారట. మోక్షజ్ఞ తొలి సినిమాకు అదిరిపోయే మాస్ కథ కాకుండా, సాఫ్ట్ ప్రేమ కథ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకి `ప్రేమించి చూడు` అనే టైటిల్ కూడా ఖరారు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మ‌రి దీనిపై ఎప్పుడు అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుందా అని అంద‌రు ఆస‌క్తిక‌రంగా ఎదురు చూస్తున్నారు. . ఈ రోజుల్లో, వారసత్వం కంటే, ప్రతిభ మాత్రమే యంగ్ హీరోలకు పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి మరియు బాక్సాఫీస్ వద్ద వారికి మార్కెట్‌ను సృష్టించడానికి సహాయపడుతుందని బాలయ్య బాగా నమ్ముతున్నారట.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది