
Nagarjuna Gave Gift For His Wife Amala
Nagarjuna – Amala : అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు నాగార్జున. ఆరంభంలోనే ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఆయన.. మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకున్నారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఆయన.. ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. ఇక, లవర్ బాయ్‌గా, మన్మథుడిగా, భక్తుడిగా, దేవుడిగా కనిపించినా అది నాగార్జునకు మాత్రమే సాధ్యమైంది. యంగ్ ఏజ్ నుంచి ఆరుపదుల వయసులోనూ తన సత్తాను చూపిస్తూనే ఉన్నారు.
కింగ్ నాగార్జున కేవలం సినిమాలకే పరిమితం అవలేదు. ఆ మధ్య ఓ ఛానెల్‌కు సహా భాగస్వామిగా ఉన్న ఆయన.. ఆ తర్వాత ఎన్నో వ్యాపారాలను మొదలు పెట్టారు. ఇందులో బాడ్మింటన్ లీగ్, ఫుల్‌బాల్ లీగ్‌లలో ఒక్కో జట్టుకు ఓనర్‌గా కూడా వ్యవహరించారు. ఇలా ఆయన దేశ వ్యాప్తంగా తన రేంజ్‌ను మరింతగా పెంచుకుంటూ పక్కా బిజినెస్‌మ్యాన్ అనిపించుకునేలా మారిపోయారు . నాగార్జునకు దాదాపు రూ. 1200 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ఓ టాక్ ఉంది. అలాగే, దాదాపు 100 కోట్ల విలువున్న ప్రాపర్టీలు కూడా చాలా ఉన్నాయట. అలాగే, కార్లు, ఇల్లు మిగతా యాక్ససిరీస్‌ల విలువ 200 – 300 కోట్లు ఉంటుందట. అంతేకాదు, నాగార్జున ఇప్పుడు ఒక్కో సినిమాకు రూ. 10 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.
Nagarjuna Gave Gift For His Wife Amala
తక్కువ కాలంలోనే నాగ్ బాగానే సంపాదించాడు. అయితే నాగార్జున దగ్గర పెళ్లయిన కొత్తలో అమల ఓ మాట తీసుకుందట . ఆ పని ఖచ్చితంగా చేసి తీరాల్సిందే అంటూ ప్రామిస్ చేయించుకుందట. జంతు ప్రేమికురాలైన అమల తన సంపాదనలో కొంచెం జంతువుల సంరక్షణ కోసం ఇస్తుందట. అదే విధంగా నాగార్జునను కూడా ఏటా తన సంపాదనలో కొంచెం జంతువుల సంరక్షణ కు ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టిందట .ఆ కండీషన్‌కి అప్పట్లో ఓకే చెప్పిన నాగార్జున ఇప్పటికీ కూడా తన సంపాదనలో జంతువుల సంరక్షణ కు కొంచెం అమౌంట్ ఇచ్చేస్తాడట. ఈ విషయం తెలుసుకొని అమలపై నాగ్‌కి ఎంత ప్రేమ ఉందని ముచ్చటించుకుంటున్నారు.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.