Balakrishna : ఒకే సినిమాతో ఇద్దరు నందమూరి వారసులు.. బాలయ్య ప్లానింగ్ అంటే దబిడి దిబిడి అవ్వాల్సిందే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Balakrishna : ఒకే సినిమాతో ఇద్దరు నందమూరి వారసులు.. బాలయ్య ప్లానింగ్ అంటే దబిడి దిబిడి అవ్వాల్సిందే..!

Balakrishna : స్టార్ వారసుల ఎంట్రీ కోసం ఆ హీరోల ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే చిరు వారసుడు చరణ్ గ్లోబల్ స్టార్ గా అదరగొట్టేస్తున్నాడు. నాగార్జున కూడా తన వారసులైన నాగ చైతన్య, అఖిల్,లను ఇంట్రడ్యూస్ చేశాడు. ఐతే వెంకటేష్ కొడుకు అర్జున్ కి ఇంకాస్త టైం ఉంటుందని తెలుస్తుండగా బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాలకృష్ణ కూడా మోక్షజ్ఞని ఎప్పుడెప్పుడు వెండితెర మీదకు […]

 Authored By ramu | The Telugu News | Updated on :15 July 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Balakrishna : ఒకే సినిమాతో ఇద్దరు నందమూరి వారసులు.. బాలయ్య ప్లానింగ్ అంటే దబిడి దిబిడి అవ్వాల్సిందే..!

Balakrishna : స్టార్ వారసుల ఎంట్రీ కోసం ఆ హీరోల ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ఇప్పటికే చిరు వారసుడు చరణ్ గ్లోబల్ స్టార్ గా అదరగొట్టేస్తున్నాడు. నాగార్జున కూడా తన వారసులైన నాగ చైతన్య, అఖిల్,లను ఇంట్రడ్యూస్ చేశాడు. ఐతే వెంకటేష్ కొడుకు అర్జున్ కి ఇంకాస్త టైం ఉంటుందని తెలుస్తుండగా బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.బాలకృష్ణ కూడా మోక్షజ్ఞని ఎప్పుడెప్పుడు వెండితెర మీదకు తీసుకు వద్దామా అనే ఆలోచనలోనే ఉన్నాడు. లెజెండ్ నుంచి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి హడావిడి చేయడం ఆ తర్వాత ఊసురుమనించడం అలవాటుగా మారింది. ఐతే ఈసారి బాలకృష్ణ నిజంగానే మోక్షజ్ఞ డెబ్యూ గురించి ఫైనల్ డెసిషన్ తీసుకున్నారని తెలుస్తుంది.

Balakrishna మోక్షజ్ఞతో పాటు తేజశ్వి కూడా..

మోక్షజ్ఞ హీరోగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో సినిమా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాను బాలయ్య చిన్న కూతురు తేజశ్విని నిర్మిస్తుందని తెలుస్తుంది. అంటే ఒకే సినిమాతో నందమూరి బాలకృష్ణ వారసులిద్దరు కూడా సినిమాల్లోకి రానున్నారు. కచ్చితంగా ఇది ఫ్యాన్స్ కి బూస్ట్ ఇచ్చే వార్తే అని చెప్పొచ్చు. మోక్షజ్ఞ ఇప్పటికే హీరోగా అన్ని విభాగాల్లో ప్రావీణ్యం సాధించాడని తెలుస్తుంది. తొలి సినిమాతోనే అతన్నొక సూపర్ హీరోగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంత్ వర్మతో బాలకృష్ణ ఇప్పటికే కథా చర్చలు ముగించారని తెలుస్తుంది. త్వరలోనే మోస్ఖజ్ఞ తొలి సినిమా గురించి అఫీషియల్ అప్డేట్ బయటకు రాబోతుందని తెలుస్తుంది.

Balakrishna ఒకే సినిమాతో ఇద్దరు నందమూరి వారసులు బాలయ్య ప్లానింగ్ అంటే దబిడి దిబిడి అవ్వాల్సిందే

Balakrishna : ఒకే సినిమాతో ఇద్దరు నందమూరి వారసులు.. బాలయ్య ప్లానింగ్ అంటే దబిడి దిబిడి అవ్వాల్సిందే..!

మోక్షజ్ఞ తెర మీద.. తేజశ్విని తెర వెనక ఇద్దరు ఒకేసారి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చిరు తనయురాలు సుస్మిత కాస్టూం డిజైనర్ గా నిర్మాతగా పరిశ్రమలో కొనసాగుతుంది. ఇప్పుడు బాలయ్య కూతురు తేజశ్విని కూడా అదే తరహాలో నిర్మాతగా తన టాలెంట్ చూపించబోతుంది. తేజశ్విని ఇంతకుముందు బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోకి పనిచేసింది. ఆ టాక్ షో అంత సక్సెస్ అవ్వడానికి వెనక తేజశ్విని ఒక రీజన్ అని తెలుస్తుంది. సో తేజశ్విని కూడా నిర్మాతగా తన సత్తా చాటుతుందేమో చూడాలి.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది