Categories: EntertainmentNews

BalaKrishna : బాల‌కృష్ణ అన్‌స్టాప‌బుల్ 2కి టైం ఫిక్స్.. ఎప్పటి నుండి అంటే..!

Advertisement
Advertisement

BalaKrishna : బాల‌కృష్ణ‌లోని కొత్త కోణాన్ని ప‌రిచ‌యం చేసిన షో అన్‌స్టాప‌బుల్. ఈ కార్య‌క్ర‌మంలో బాలయ్య చేసిన సంద‌డి అంతా ఇంతా కాదు. ఈ షో సీజన్‌ 1 గతేడాది నవంబర్‌ 4 నుంచి ఆహా ఓటీటీలో టెలికాస్ట్‌ అయింది. తొలి సీజన్‌లో భాగంగా 10 ఎపిసోడ్లు వచ్చాయి. తన సినిమాలతో మాస్‌ ప్రేక్షకులను సంపాదించుకున్న బాలయ్య.. ఈ టాక్‌ షోతో మరింత మంది ఫ్యాన్స్‌కు దగ్గరయ్యాడు. అన్‌స్టాపబుల్‌తో అతని ఫ్యాన్‌ బేస్‌ మరింత పెరిగింది. దీంతో రెండో సీజన్‌ తీసుకురావడానికి ఆహా ఓటీటీ ఏర్పాట్లు చేస్తోంది. అన్‌స్టాపబుల్‌ విత్‌ ఎన్‌బీకే రెండో సీజన్‌ ఆగస్ట్‌ నుంచి ప్రసారం కానుంది. ఇప్పటికే సన్నాహాలు చేసినట్లు తెలుస్తోంది.

Advertisement

సీజన్ 1 ని మించేలా మరింత ఎంటర్టైన్మెంట్, ఫన్ తో సీజన్ 2 కొనసాగనుందని స‌మాచారం. అన్‌స్టాప‌బుల్ టాక్ షో మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలోనే 9.7 రేటింగ్‌తో IMDBలో తొలి స్థానంలో నిలిచింది. మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ తో గ్రాండ్ గా ముగిసింది. మొదటి సీజన్ లో మంచు ఫ్యామిలీ, టీం, రవితేజ, అఖండ టీం, బ్రహ్మానందం, రాజమౌళి, మహేష్ బాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు వచ్చి అలరించారు. మొదటి సీజన్ కంటే రెండో సీజన్ లోనే చాలా మంది అగ్రహీరోలు ప్రత్యేక అతిథులుగా రాబోతున్నట్లు తెలుస్తోంది. రెండవ సీజన్ ఎప్పుడు మొదలు పెడతారు అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Advertisement

Balakrishna Unstoppable 2 for Time fix The first episode of the second season on August 15

BalaKrishna : గుడ్ న్యూస్..

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్ట్‌ 15న రెండో సీజన్‌ తొలి ఎపిసోడ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇది బాలయ్య బాబు, అన్‌స్టాపబుల్‌ షో ఫ్యాన్స్‌కు నిజంగా గుడ్‌న్యూసే. ప్రస్తుతం బాలకృష్ణ తన తర్వాతి మూవీ ఎన్‌బీకే 107లో నటిస్తున్నాడు. వచ్చే వారం షూటింగ్‌ కోసం విదేశాలకు వెళ్లనున్నాడు. అతడు తిరిగి వచ్చిన తర్వాత అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 2 ఎపిసోడ్ల షూటింగ్‌ జరగనుంది.గత సీజన్‌లో సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబుతో చివరి ఎపిసోడ్‌ నిర్వహించారు. ఆ ఎపిసోడ్‌ సూపర్‌ సక్సెస్‌ అయింది. దీంతో ఈ సీజన్‌ను మెగాస్టార్‌ చిరంజీవితో ప్రారంభించాలన్న ఆలోచనలో మేకర్స్‌ ఉన్నారు.

Recent Posts

Rythu Bharosa Funds : రైతు భరోసా నిధుల విడుదలపై తాజా అప్డేట్..ఆ రోజు నుంచే అకౌంట్లోకి డబ్బులు జమ..!

Rythu Bharosa Funds: రైతులకు అత్యంత కీలకమైన రైతు భరోసా పథకంRythu Bharosa Scheme పై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది.…

12 minutes ago

Private School Fees : ప్రైవేట్ స్కూల్ ఫీజుల పెంపుకు బ్రేక్: కొత్త చట్టంతో నియంత్రణకు ప్రభుత్వం సన్నాహాలు

Private School Fees : తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల Private and corporate school fees…

1 hour ago

Lucky Draw Promotion : ఆఖరికి దేవుడ్ని కూడా వదలని ఇన్‌ఫ్లూయెన్సర్లు..వ్యూస్ కోసం ఇంతకు తెగబడతారా ?

ప్రస్తుత కాలంలో రాత్రికి రాత్రే ఫేమస్ అయిపోవాలనే ఆరాటంతో చాలా మంది యువత ప్రాణాలకు తెగించి విన్యాసాలు చేయడమే కాకుండా,…

1 hour ago

viral video: నిజం గడప దాటే లోపు..అబద్ధం ఊరంతా ఊరేగి వస్తుందంటే ఇదేనేమో..సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వీడియో..!

viral video: సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో కేరళలో Kerala తీవ్ర విషాదానికి దారి తీసింది. బస్సులో…

2 hours ago

RBI Jobs : 10వ తరగతి అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో భారీ ఉద్యోగ అవకాశాలు.. నోటిఫికేషన్ ముఖ్య వివరాలు ఇవే..!

RBI Jobs : 10వ తరగతి పూర్తిచేసిన యువతకు ఇది నిజంగా శుభవార్త. గవర్నమెంట్ ఉద్యోగం Government job కోసం…

2 hours ago

TVS Jupiter : అదిరిపోయే ఫీచర్లతో  రూ.76 వేలకు టీవీఎస్ జూపిటర్..!

TVS Jupiter : భారతీయ ద్విచక్ర వాహన మార్కెట్‌లో టీవీఎస్ జూపిటర్ 110 ( TVS Jupiter 110 )…

3 hours ago

Dwakra womens : డ్వాక్రా మహిళలకు రూ.3 లక్షల వరకూ వడ్డీ లేని రుణం..ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

Dwakra womens : డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు Central and state governments వరుసగా…

4 hours ago

Today Gold Rate 19 January 2026 : వామ్మో మళ్లీ కొండెక్కిన బంగారం ధరలు

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి కారణంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా ఆకాశాన్ని తాకుతున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో…

5 hours ago