Bandla Ganesh And Sameer Punch to Anchor Suma In Cash Show
Anchor Suma : యాంకర్ సుమ అంటే మాటలఝరి, పంచ్‌ల ప్రవాహం. సుమ నోటికి తిరుగుండదు. అవతల ఉన్నది ఎవరైనా సరే సుమ పంచ్ వేస్తే పేలిపోవాల్సిందే. కానీ సుమకే రివర్స్ పంచ్‌లు వేసి నోర్మూసుకునేల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంత వరకు తన షోల్లో తన మీద పంచ్‌ల వర్షం పడటం ఎప్పుడూ చూసి ఉండదు సుమ. కానీ మొదటి సారి సుమకు ఊపరి ఆడకుండా చేసేశాడు బండ్ల గణేష్. వచ్చే వారం ప్రసారం కానున్న క్యాష్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో డేగల బాబ్జీ టీం వచ్చింది. బండ్ల గణేష్, సమీర్, జోష్ రవి, డైరెక్టర్ వచ్చారు.
అయితే ఇందులో సుమ ఓ నాటకం ఆడేసింది. దేవీ నాగవల్లిలా మారిపోయింది.గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని సమీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బండ్ల గణేష్ రంగంలోకి దిగాడు. గెట్ అవుట్ ఫ్రమ్ స్టూడియో ఏందమ్మా.. నువ్వేమైనా రామోజీ రావా? అని పరువు తీసేశాడు. దీంతో సుమ ఒక్కసారిగా అవాక్కైంది. ఆ తరువాత మళ్లీ సుమ ఏదో అనేసింది. ఈటీవీ పర్మినెంట్.. క్యాష్ షో పర్మినెంట్.. సుమ పర్మినెంట్ కాదు అని మరో కౌంటర్ వేశాడు. దీనికి సుమకు దిమ్మ తిరిగిపోయింది.ఏంటి నేను పర్మినెంట్ కాదా?.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మొక్క పెట్టినప్పటి నుంచి నేను ఉన్నాను అని సుమ అంటుంది. నువ్ మొక్క పెట్టినప్పటి నుంచే ఉన్నావ్..
Bandla Ganesh And Sameer Punch to Anchor Suma In Cash Show
ఆయన ఇక్కడ స్థలం కొన్నప్పటి నుంచి నేనున్నా అంటూ కౌంటర్ వేస్తాడు. దీంతో మరోసారి సుమ ఖంగుతింటుంది. స్టార్ మహిళ పన్నెండేళ్లు చేశాను అని అంటుంది.. అయితే ఏంటి.. ఇంకో పన్నెండేళ్లు ఉంటే చేస్తావా? అని కౌంటర్ వేశాడు బండ్లన్న. ఇక మధ్యలోకి సమీర్ ఎంట్రీ ఇస్తాడు. రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్ చేసింది కూడా సుమనే అని అంటాడు.యాడ్ చేసింది ఆమెనే అయినా.. ఆ ఐడియా ఇచ్చింది నేనే అని బండ్లన్న క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. ఇలా సుమకు వరుసగా పంచ్‌లు పడటం ఇదే మొదటిసారి. బండ్లన్న దెబ్బకు సుమ ఏం చేయలేకపోయింది.
Raksha Bandhan : రాఖీ పండుగ వచ్చింది తమ సోదరులకి సోదరీమణులు ఎంతో ఖరీదు చేసే రాఖీలను కొని, కట్టి…
Pooja Things: శ్రావణమాసం వచ్చింది. అనేక రకాలుగా ఆధ్యాత్మికతో భక్తులు నిండి ఉంటారు. ఈ సమయంలో అనేకరకాల పూజలు, వ్రతాలు,…
Sand Mafia : రాజానగరం నియోజకవర్గంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అక్కడికి దగ్గరలో ఉన్న కలవచర్ల గ్రామంలో పోలవరం ఎడమ…
Viral Video : మాములుగా పందేలు అనగానే కోడిపందేలు , ఏండ్ల పందేలు, గుర్రపు పందేలు చూస్తుంటాం..కానీ తాజాగా ఓ…
Rashmika Mandanna : చాలా రోజుల తర్వాత విజయ్ దేవరకొండ మంచి హిట్ కొట్టాడు. కింగ్డమ్ చిత్రం విజయ్‌కి బూస్టప్‌ని…
Three MLAs : తెలంగాణ రాజకీయాల్లో అనర్హత వేటు కలకలం రేపుతోంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన…
Hero Vida : భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో గణనీయమైన పురోగతి నమోదు అవుతోంది. దీనిలో భాగంగా హీరో మోటోకార్ప…
PM Kisan : పీఎం కిసాన్ రైతుల కోసం ఆగస్టు 2న 20వ విడత విడుదల అయింది. యూపీలోని వారణాసి…
This website uses cookies.