Anchor Suma : దెబ్బకు నోర్మూసుకున్న యాంకర్ సుమ.. దడదడలాడించిన బండ్ల గణేష్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anchor Suma : దెబ్బకు నోర్మూసుకున్న యాంకర్ సుమ.. దడదడలాడించిన బండ్ల గణేష్

 Authored By prabhas | The Telugu News | Updated on :23 May 2022,1:00 pm

Anchor Suma : యాంకర్ సుమ అంటే మాటలఝరి, పంచ్‌ల ప్రవాహం. సుమ నోటికి తిరుగుండదు. అవతల ఉన్నది ఎవరైనా సరే సుమ పంచ్ వేస్తే పేలిపోవాల్సిందే. కానీ సుమకే రివర్స్ పంచ్‌లు వేసి నోర్మూసుకునేల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇంత వరకు తన షోల్లో తన మీద పంచ్‌ల వర్షం పడటం ఎప్పుడూ చూసి ఉండదు సుమ. కానీ మొదటి సారి సుమకు ఊపరి ఆడకుండా చేసేశాడు బండ్ల గణేష్. వచ్చే వారం ప్రసారం కానున్న క్యాష్ ఎపిసోడ్ ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో డేగల బాబ్జీ టీం వచ్చింది. బండ్ల గణేష్, సమీర్, జోష్ రవి, డైరెక్టర్ వచ్చారు.

అయితే ఇందులో సుమ ఓ నాటకం ఆడేసింది. దేవీ నాగవల్లిలా మారిపోయింది.గెట్ అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అని సమీర్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో బండ్ల గణేష్ రంగంలోకి దిగాడు. గెట్ అవుట్ ఫ్రమ్ స్టూడియో ఏందమ్మా.. నువ్వేమైనా రామోజీ రావా? అని పరువు తీసేశాడు. దీంతో సుమ ఒక్కసారిగా అవాక్కైంది. ఆ తరువాత మళ్లీ సుమ ఏదో అనేసింది. ఈటీవీ పర్మినెంట్.. క్యాష్ షో పర్మినెంట్.. సుమ పర్మినెంట్ కాదు అని మరో కౌంటర్ వేశాడు. దీనికి సుమకు దిమ్మ తిరిగిపోయింది.ఏంటి నేను పర్మినెంట్ కాదా?.. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ మొక్క పెట్టినప్పటి నుంచి నేను ఉన్నాను అని సుమ అంటుంది. నువ్ మొక్క పెట్టినప్పటి నుంచే ఉన్నావ్..

Bandla Ganesh And Sameer Punch to Anchor Suma In Cash Show

Bandla Ganesh And Sameer Punch to Anchor Suma In Cash Show

ఆయన ఇక్కడ స్థలం కొన్నప్పటి నుంచి నేనున్నా అంటూ కౌంటర్ వేస్తాడు. దీంతో మరోసారి సుమ ఖంగుతింటుంది. స్టార్ మహిళ పన్నెండేళ్లు చేశాను అని అంటుంది.. అయితే ఏంటి.. ఇంకో పన్నెండేళ్లు ఉంటే చేస్తావా? అని కౌంటర్ వేశాడు బండ్లన్న. ఇక మధ్యలోకి సమీర్ ఎంట్రీ ఇస్తాడు. రామోజీ ఫిల్మ్ సిటీ యాడ్ చేసింది కూడా సుమనే అని అంటాడు.యాడ్ చేసింది ఆమెనే అయినా.. ఆ ఐడియా ఇచ్చింది నేనే అని బండ్లన్న క్రెడిట్ తన ఖాతాలో వేసుకుంటాడు. దీంతో అందరూ పగలబడి నవ్వేస్తారు. ఇలా సుమకు వరుసగా పంచ్‌లు పడటం ఇదే మొదటిసారి. బండ్లన్న దెబ్బకు సుమ ఏం చేయలేకపోయింది.

YouTube video

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది