Bheemla Nayak : భీమ్లా నాయక్ పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు.. న్యాయానికి, ధర్మానికి రోజులు లేవు బ్రదర్..!
Bheemla Nayak : టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కు ఇండస్ట్రీ లో వివాదాలు కొత్తేమి కాదు. గతంలో అనేక భారీ బడ్జెట్ సినిమాలని నిర్మించి హిట్ లో సొంతం చేసుకున్న ఈ నిర్మాత.. ఈ మధ్య సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకున్నారు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ఏ చిన్న అన్యాయం జరిగిన వెంటనే తన దైన శైలిలో స్పందిస్తారు బండ్ల గణేష్. తాజాగా భీమ్లా నాయక్ చిత్రం పోస్ట్ పోన్ పై ఇప్పటికే వివాదం నడుస్తూ ఉండగా.. దీనిపై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.అందరూ అనుకుంటూ ఉన్నట్లుగానే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమాను పోస్ట్ పొన్ చేయడంతో పవన్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. భీమ్లా నాయక్ సినిమాను వీళ్లంతా కలసి వాయిదా వేయించారు. ‘రేపు పవన్ చిత్రానికి సమస్య వస్తే ఈ నిర్మాతలంతా సాయం చేస్తారా ..? అంటూ ఓ నెటిజన్ బండ్ల గణేష్ ని ట్యాగ్ చేస్తూ ట్విట్టర్ లో ప్రశ్నించాడు. అందుకు బదులుగా.. న్యాయానికి, ధర్మానికి రోజులు లేవు బ్రదర్ అంటూ బండ్ల గణేష్ ఊహించని రీతిలో స్పందించారు. ఇప్పుడీ కామెంట్ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.

Bandla Ganesh sensational comments on Bheemla Nayak post pone going viral
Bheemla Nayak : న్యాయానికి ధర్మానికి రోజులు లేవు..
తమ అభిమాన నటుడి సినిమా షూటింగ్ వర్క్ అంతా పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉండగా.. చివరి నిమిషంలో ఇలా చేయడం భావ్యం కాదంటూ పవన్ అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆర్ ఆర్ ఆర్ చిత్రం కోసమే పవన్ ను ఒప్పించి మరి భీమ్లానాయక్ ను పోస్ట్ పొన్ చేయించారని పవన్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పవన్ ను తమ అవసరానికి వాడుకుంటున్నారని మండి పడుతున్నారు. దిల్ రాజుతో సహా ఇతర నిర్మాతలు భీమ్లా నాయక్ నిర్మాతలపై ఒత్తిడి చేసి పక్కకు తప్పించారనే ప్రచారం జరుగుతోంది. చూస్తుంటే ఇది రాబోయే రోజుల్లో మరింత వివాదంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.