Bandla Ganesh : బండ్ల గణేష్ కు బిగ్ షాక్.. ఆ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష.. 95 లక్షల జ‌రిమానా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandla Ganesh : బండ్ల గణేష్ కు బిగ్ షాక్.. ఆ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష.. 95 లక్షల జ‌రిమానా..!

 Authored By aruna | The Telugu News | Updated on :14 February 2024,2:13 pm

ప్రధానాంశాలు:

  •  Bandla Ganesh : బండ్ల గణేష్ కు బిగ్ షాక్.. ఆ కేసులో ఏడాది పాటు జైలు శిక్ష..!

Bandla Ganesh : tollywood producer bandla ganesh ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆయన ఎన్నో సినిమాలలో నటించారు. నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. ఇక బండ్ల గణేష్ సోషల్ మీడియాలో ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ ఉంటారు. అయితే ఆయనకు ఏడాది జైలు శిక్ష పడింది. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్ట్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది..బండ్ల గణేష్ కు ఏడాది పాటు జైలు శిక్షతోపాటు రూ. 95 లక్షల జరిమానాను కోర్టు విధించింది. ఇక ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఇచ్చిన తీర్పును అప్పీల్ చేసుకునేందుకు గడువు కూడా ఇచ్చింది. వెంకటేశ్వర్లు అనే వ్యక్తికి బండ్ల గణేష్ నిర్మాణ సంస్థ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ నుండి చెక్ బౌన్స్ అయిన కారణంగా కోర్టులో సదరు వ్యక్తి కేసు వేశారు.

బండ్ల గణేష్ Bandla Ganesh ప్రకాశం జిల్లాలోని మద్దిరాలపాడు కు చెందిన జానకి రామయ్య నుంచి 2019లో 95 లక్షలకు అప్పు తీసుకున్నారు. అయితే ఆయన కొన్ని రోజుల తర్వాత మరణించారు. దీంతో జానకి రామయ్య తండ్రి కి బండ్ల గణేష్ 95 లక్షల చెక్ రూపంలో చెల్లించారు. కానీ అది బౌన్స్ అయింది. దీంతో ఆయన కోర్ట్ కి వెళ్లారు. దీనిపై కోర్టు విచారణ చేపట్టింది. ఏడాది శిక్షతో పాటు 95 లక్షలు జరిమానా విధించింది. కాగా బండ్ల గణేష్ కు చెక్ బౌన్స్ కేసులో శిక్ష పడడం ఇది తొలిసారి కాదు. టెంపర్ సినిమా సమయంలో రచయిత వక్కంత వంశీ దాఖలు చేసిన 25 లక్షల చెక్ బౌన్స్ కేసులో ఆయనకు 2017లో హైదరాబాద్ ఎర్రమంజిల్ కోర్టు తీర్పు వెలువరించింది. వెంటనే బండ గణేష్ బెయిల్ కి అప్లై చేసుకున్నారు. వెంటనే బెయిల్ లభించింది.

ఇకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న బండ గణేష్ చాలా సినిమాలు తన నటనతో మెప్పించారు ఆ తర్వాత రవితేజ ఆంజనేయులు సినిమాతో నిర్మాతగా మారి మంచి సక్సెస్ను అందుకున్నారు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్లో గబ్బర్ సింగ్ భాషా ఇద్దరమ్మాయిలతో టెంపర్ వంటి సినిమాలను నిర్మించారు గబ్బర్ సింగ్ సినిమాతో బండ్ల గణేష్ కి అత్యధిక పశువులు సాధించారు. ఇక బండ్ల గణేష్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారా పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వైర్లు అవుతుంటారు ఇక కాంగ్రెస్ నాయకుడిగా కూడా ఆయన ప్రతిపక్ష పార్టీపై ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు ఇక ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులో అరెస్ట్ మరోసారి వార్తల్లో నిలిచారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది