Bandla Ganesh : కేటీఆర్ చేస్తే సంసారం.. రేవంత్ రెడ్డి చేస్తే తప్పా.. కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్..!
ప్రధానాంశాలు:
Bandla Ganesh : కేటీఆర్ చేస్తే సంసారం.. రేవంత్ రెడ్డి చేస్తే తప్పా.. కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్..!
Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఫంక్షన్ అయినా పొలిటికల్ సభ అయిన పబ్లిక్ తో చిట్ చాట్ అయినా ఆయన చేసే వ్యాఖ్యలకు, ప్రసంగాలకు ప్రత్యేక ఫాన్స్ ఉంటారు. ఆయన మాట్లాడే వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఇక తాజాగా బండ్ల గణేష్ తెలంగాణ రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే తనకు భయమనిపిస్తుందని, అతడిని చూస్తే జాలేస్తుందని బండ్ల గణేష్ అన్నారు. రెండేళ్లలో ప్రభుత్వాన్ని పడగొడతాం, త్వరలో కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అవుతారు అని అంటున్నారని, అయితే ఆ ప్రయత్నం పక్క రాష్ట్రాల్లో చేసుకోవాలని అన్నారు. త్వరలో ఏపీలో, మహారాష్ట్రలో, కేరళలో ఎన్నికలు జరగనున్నాయి.
అయినా భారత రాష్ట్ర సమితి అధినేత కేసిఆర్ కు ఏ రాష్ట్రం నుంచి అయిన పోటీ చేసే అర్హత ఉందని, బీఆర్ఎస్ భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా అని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిస్తే కొంపలు మునిగిపోయినట్లు ఆగమాగం అవుతున్నారని బండ్ల గణేష్ స్పందించారు. అలా రేవంత్ ని కలిసిన ఎమ్మెల్యేలను మానసికంగా హింసించి, స్క్రిప్ట్ రాసిచ్చి, ప్రెస్ మీట్ లు పెట్టి చదవమని చెప్పారని అన్నారు. నియోజకవర్గంలో రెండు లక్షల ఓటర్లకు ప్రతినిధిగా ఉన్నప్పుడు వారి కష్టాల గురించి ముఖ్యమంత్రి కి చెప్పుకోవద్దా.. ముఖ్యమంత్రిని కలవద్దా..ఇది ప్రజాస్వామ్యం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని ప్రజలంతా మీ చెప్పు చేతల్లో ఉండాలని ఇంకా ఆలోచిస్తున్నారా అని బండ్ల గణేష్ నిలదీశారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా పరిపాలిస్తుందని, పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే కేటీఆర్ డైలీ ప్రెస్ మీట్ లు పెడుతున్నారని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్న విషయాన్ని బండ్ల స్పందించారు. బీఆర్ఎస్ చేస్తే సంస్కారం, కాంగ్రెస్ చేస్తే తప్పా అని బండ్ల గణేష్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రస్తుతానికి సీఎం పోస్టు ఖాళీగా లేదని, ఐదేళ్ల వరకు ఎన్నికలు లేవని, మరో పదేళ్లు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని గణేష్ అన్నారు. అలా కాకుండా ఇప్పుడే సీఎం అవ్వాలని భావిస్తే వేరే రాష్ట్రాలకు వెళ్లాలని బండ్ల గణేష్ సూచించారు. ఇక లాస్ట్ లో మీరు ఆగం కావద్దని కోరుకుంటూ..మీ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ..మీ బండ్ల గణేష్ అని వీడియోను ముగించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Mr.KTR…!
MLA’s are not Buffalos to tie in your shedనలుగురు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని కలిస్తే.. కేటీఆర్ గారు ఉలిక్కిపడి భయపడుతున్నారు.
— కాంగ్రెస్ నేత సినీనిర్మాత, బండ్ల గణేష్If the four MLAs meet the Chief Minister, KTR is shocked and afraid.
— Congress leader… pic.twitter.com/8orLp0CMHm— Congress for Telangana (@Congress4TS) January 25, 2024