Bandla Ganesh : మల్లారెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bandla Ganesh : మల్లారెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ..!

 Authored By aruna | The Telugu News | Updated on :3 February 2024,7:30 pm

ప్రధానాంశాలు:

  •  Bandla Ganesh : మల్లారెడ్డి పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన బండ్ల గణేష్ ..!

Bandla Ganesh : సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు.వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు.2024 లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్లో దరఖాస్తు చేసుకున్నారు. అనంతరం బీఆర్ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డి పై బండ్ల గణేష్ సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇంద్రవెల్లి సభ కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ రెండు నెలల రేవంత్ రెడ్డి పాలన గురించి ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మతిభ్రమించి మల్లారెడ్డి ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు…

విద్యార్థుల రక్తాన్ని పీల్చి ఫీజులు వసూలు చేస్తున్నారు మల్లారెడ్డి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పరిపాలన చూసి కాంగ్రెస్ కార్యకర్తగా నేను గర్వపడుతున్నా అని అన్నారు. నిజాయితీగా తెలంగాణకు పరిపాలన అందిస్తున్నారని తెలిపారు. రెండు నెలల రేవంత్ రెడ్డి పాలన అద్భుతం అని, రాబోయే అన్ని ఎంపి స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. మల్లారెడ్డి పిచ్చిపిచ్చి ఆరోఫణలు చేస్తూ ఫీజుల రూపంలో విద్యార్థుల రక్తాన్ని పీల్చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ తనకు మల్కాజిగిరి నుంచి పోటీ చేశా అవకాశం ఇస్తే తప్పకుండా గెలుస్తానని చెప్పారు. మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటే తీసుకునేది లేదని స్పష్టం చేశారు. డబ్బులు ఉన్నాయనే అహంకారంతో మల్లారెడ్డి మాట్లాడుతున్నాడు, చరిత్రలో రాజ్యాలే కూలిపోయాయి డబ్బున్న వాడు బికారి కూడా అవుతాడు.

డబ్బు అనే అహంకారంతో మల్లారెడ్డి సీఎం ను వాడు వీడు అని మాట్లాడడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పద్ధతి కాదు ఎంతమంది వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. సీఎం రేవంత్ రెడ్డిని టచ్ కూడా చేయలేరు. రోజుకు 20 గంటలు పని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. సీఎం పాలన చూసి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తెలంగాణ ఇచ్చి పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్నా అర్ధరహిత ఆరోపణలు ఎప్పుడూ చేయలేదు అని అన్నారు. ఇక పార్లమెంట్ బరిలో నిలిచే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తుంది. దీనికోసం హైదరాబాద్లోని గాంధీభవన్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మినీ ఇండియా గా పేరు ఉన్న మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావాహులు దరఖాస్తులు సమర్పించినట్లు తెలుస్తోంది. అధిష్టానం చివరికి ఎవరికి టికెట్ ఇస్తుందో చూడాలి.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది