Bhanu Sree : సినీ ఆఫర్స్ కోసం ఆ ప‌ని చేసా.. యాంకర్ భాను షాకింగ్ కామెంట్స్..

Authored By mallesh | The Telugu News | Updated on : 20 December 2021, 7:00 pm

Bhanu Sree : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ సీజన్ టూలో కంటెస్టెంట్‌గా పార్టిసిపేట్ చేసిన భానుశ్రీ అందరికీ గుర్తుండే ఉంటుంది. డాన్సర్‌గా, యాంకర్‌గా, యాక్ట్రెస్‌గా భాను శ్రీ రాణిస్తోంది. ‘బిగ్ బాస్’ ద్వారా తన పాపులారిటీని ఇంకా పెంచేసుకున్న ఈ భామ.. తాజగా తాను సినీ ఆఫర్స్ కోసం పడ్డ కష్టాలను వివరించింది. ఈ క్రమంలోనే తనకు ఎదురైన చేదు అనుభవాలను గురించి వివరించింది.‘ఏడు చేపల కథ’ సినిమాతో భాను శ్రీ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే ఈ సుందరి ‘జబర్దస్త్’ కార్యక్రమంతో పాటు మరి కొన్ని కార్యక్రమాల్లో మెరుస్తుంటుంది. పలు సినీ ఫంక్షన్స్, ఈవెంట్స్‌లోనూ భాను శ్రీ యాంకరింగ్ చేస్తోంది. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా ఈ భామ తన గ్లామరస్ ఫొటోస్‌ను ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటుంది కూడా. భాను శ్రీ ఇటు బుల్లితెర అటు వెండితెర రెండిటినీ బ్యాలెన్స్ చేస్తున్నది.అయితే, ఈ సుందరికి ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో పాత్ర వెండితెరపై పడలేదని చెప్పొచ్చు.తాను సినిమాల్లోకి రావాలని వరంగల్ నుంచి ఇంట్లో ఎవరికి చెప్పా పెట్టకుండా హైదరాబాద్ వచ్చేశానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపింది భాను శ్రీ.

bhanu sree shocking comments on her career starting days

bhanu sree shocking comments on her career starting days

Bhanu Sree : అమ్మనాన్నల కంటే తనకు అతనే ఎక్కువ అంటున్న భానుశ్రీ..

అలా తన కెరీర్ స్టార్టింగ్ డేస్‌లో చాలా ఇబ్బందులు పడ్డానని భాను శ్రీ పేర్కొంది. ఆ టైంలో తనకు తన బాయ్ ఫ్రెండ్ చాలా హెల్ప్ చేశాడని వివరించింది. ఇకపోతే తను సినిమా అవకాశాల కోసం వెతికే సమయంలో డబ్బులు సంపాదించుకునేందుకుగాను జ్యూస్ సెంటర్ నడుపుకున్నానని చెప్పింది భానుశ్రీ.ఇక ఆ టైంలో నైట్ టైమ్స్‌లో కూడా జ్యూస్ సెంటర్స్ నడిపిన ప్రాంతాల్లోనే పడుకున్నానని తెలిపింది. మొత్తంగా చాలా కష్టాలు పడి సినీ ఇండస్ట్రీలో ఏదో ఒక మంచి అవకాశం వస్తుందా అని వేచి చూశానని తెలిపింది భానుశ్రీ. ప్రజెంట్ ఈ హాట్ భామ యాంకరింగ్ ప్లస్ పలు ఈవెంట్స్ చేస్తూ బాగానే సంపాదిస్తోంది.

Advertisement

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి