NTR : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి కీర్తి ఎనలేనిది. ఎంతోమంది సినిమా వాళ్ళకు ఆయన స్ఫూర్తిదాయకం. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఆదర్శపరమైన సినిమాలు ఎన్టీఆర్ చేశారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందుగానే ఫైర్ బ్రాండ్ నటి భానుమతి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక భానుమతి ఒక నటిగా మాత్రమే కాకుండా డాన్స్ ,పాటలు పాడటం, సినిమాలకు దర్శకత్వం వహించడం, ఇంకా కొన్ని సినిమాలకు నిర్మాత గా కూడా చేశారు. సినీ ఇండస్ట్రీలోని అన్ని రంగాలలో భానుమతి గారు ప్రవేశించారు. అయితే అప్పట్లో భానుమతి గారికి చాలా డిమాండ్ ఉండేది. అందుకే ఆమెతో సినిమాలు కోసం హీరోల సైతం వేచి చూసేవారు. అయితే భానుమతి ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పటి మాదిరిగా అప్పట్లో వాటేసుకోవడాలు ఉండేవి కావు. అలాంటి వాటిలో భానుమతి మరింత స్ట్రిక్ట్ గా ఉండేవారు.
పాటలు సమయంలో కూడా కనీసం ఆమె చేయి ని తాకనిచ్చేవారు కాదు. మల్లీశ్వరి సినిమాలో ఎన్టీఆర్ తో పాటు భానుమతి నటించారు. అయితే ఈ సినిమాలో ఓ సందర్భంలో ఇద్దరు కౌగిలించుకునే సన్నివేశం ఉందట. అయితే ఆ సీన్ నేను చచ్చిన చేయనని కరాకండిగా చెప్పేసారట భానుమతి. దీంతో ఆ సీన్ లేకుండానే సినిమా పూర్తయింది. అలాగే ఈ సినిమాలో భానుమతికి పారితోషికం 20 వేల వరకు ఇచ్చారట. ఇంకా అన్నగారికి కేవలం 12 వేలు ఇచ్చి సరిపెట్టారట. అయితే నిజానికి అప్పట్లో నెలవారి జీతాలుగా హీరో హీరోయిన్లు చేసేవారు. కానీ భానుమతి మాత్రం నెల జీతానికి చేసేది కాదట అందుకే పారితోషికం ఇచ్చేవారు. ఈ క్రమంలో అన్నగారికి కూడా పారితోషికం ఇచ్చారట. ఈ విషయంలో అన్న గారు చాలా బాధపడ్డారట. భానుమతి కన్నా నేనేం తక్కువ అంటూ ప్రశ్నించారట…
అయితే ఈ సినిమాను భానుమతి ఉంది కాబట్టే తీస్తున్నారని, సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని దర్శకుడు నచ్చజెప్పి అన్న గారితో నటించేలా చేశాడట. అయితే అన్నగారికి భానుమతి అంటే చాలా గౌరవం ఉండేది. అన్న గారితో ఎన్నో సినిమాలు నటించిన భానుమతి ఆ తర్వాత ఎన్టీఆర్ కొడుకు అయినా బాలయ్య తో కూడా కొన్ని సినిమాలలో నటించింది. అయితే ఈ సినిమాలో భానుమతిని తీసుకునేందుకు ఎన్టీఆర్ ఒక కండిషన్ పెట్టారట. ఈ సినిమా షూటింగ్ సమయంలో భానుమతి వచ్చిన సమయంలో ముందుగా బాలయ్య వెళ్లి కార్ డోర్ తీసి ఆమెను సెట్స్ లోకి తీసుకురావాలని కోరారు. తన కొడుకు అలా చేయడం ఒక మర్యాదపూర్వకంగా భావించేవారు అన్నగారు. అంతలా భానుమతిని గౌరవించేవారు. అలాగే చాలా విషయాల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వారట
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.