NTR : ఎన్టీఆర్ తో ఆ సీన్ చచ్చిన చేయనని ఖరాకండిగా చెప్పేసిన భానుమతి… హర్ట్ అయిన ఎన్టీఆర్….! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

NTR : ఎన్టీఆర్ తో ఆ సీన్ చచ్చిన చేయనని ఖరాకండిగా చెప్పేసిన భానుమతి… హర్ట్ అయిన ఎన్టీఆర్….!

 Authored By prabhas | The Telugu News | Updated on :13 November 2022,9:20 pm

NTR : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారి కీర్తి ఎనలేనిది. ఎంతోమంది సినిమా వాళ్ళకు ఆయన స్ఫూర్తిదాయకం. సినీ ఇండస్ట్రీలో ఎన్నో ఆదర్శపరమైన సినిమాలు ఎన్టీఆర్ చేశారు. అయితే ఎన్టీఆర్ కంటే ముందుగానే ఫైర్ బ్రాండ్ నటి భానుమతి ఇండస్ట్రీలోకి వచ్చారు. ఇక భానుమతి ఒక నటిగా మాత్రమే కాకుండా డాన్స్ ,పాటలు పాడటం, సినిమాలకు దర్శకత్వం వహించడం, ఇంకా కొన్ని సినిమాలకు నిర్మాత గా కూడా చేశారు. సినీ ఇండస్ట్రీలోని అన్ని రంగాలలో భానుమతి గారు ప్రవేశించారు. అయితే అప్పట్లో భానుమతి గారికి చాలా డిమాండ్ ఉండేది. అందుకే ఆమెతో సినిమాలు కోసం హీరోల సైతం వేచి చూసేవారు. అయితే భానుమతి ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాలు చేశారు. ఇప్పటి మాదిరిగా అప్పట్లో వాటేసుకోవడాలు ఉండేవి కావు. అలాంటి వాటిలో భానుమతి మరింత స్ట్రిక్ట్ గా ఉండేవారు.

పాటలు సమయంలో కూడా కనీసం ఆమె చేయి ని తాకనిచ్చేవారు కాదు. మల్లీశ్వరి సినిమాలో ఎన్టీఆర్ తో పాటు భానుమతి నటించారు. అయితే ఈ సినిమాలో ఓ సందర్భంలో ఇద్దరు కౌగిలించుకునే సన్నివేశం ఉందట. అయితే ఆ సీన్ నేను చచ్చిన చేయనని కరాకండిగా చెప్పేసారట భానుమతి. దీంతో ఆ సీన్ లేకుండానే సినిమా పూర్తయింది. అలాగే ఈ సినిమాలో భానుమతికి పారితోషికం 20 వేల వరకు ఇచ్చారట. ఇంకా అన్నగారికి కేవలం 12 వేలు ఇచ్చి సరిపెట్టారట. అయితే నిజానికి అప్పట్లో నెలవారి జీతాలుగా హీరో హీరోయిన్లు చేసేవారు. కానీ భానుమతి మాత్రం నెల జీతానికి చేసేది కాదట అందుకే పారితోషికం ఇచ్చేవారు. ఈ క్రమంలో అన్నగారికి కూడా పారితోషికం ఇచ్చారట. ఈ విషయంలో అన్న గారు చాలా బాధపడ్డారట. భానుమతి కన్నా నేనేం తక్కువ అంటూ ప్రశ్నించారట…

Bhanumathi said i can do that scene with NTR

Bhanumathi said i can do that scene with NTR

అయితే ఈ సినిమాను భానుమతి ఉంది కాబట్టే తీస్తున్నారని, సినిమా కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందని దర్శకుడు నచ్చజెప్పి అన్న గారితో నటించేలా చేశాడట. అయితే అన్నగారికి భానుమతి అంటే చాలా గౌరవం ఉండేది. అన్న గారితో ఎన్నో సినిమాలు నటించిన భానుమతి ఆ తర్వాత ఎన్టీఆర్ కొడుకు అయినా బాలయ్య తో కూడా కొన్ని సినిమాలలో నటించింది. అయితే ఈ సినిమాలో భానుమతిని తీసుకునేందుకు ఎన్టీఆర్ ఒక కండిషన్ పెట్టారట. ఈ సినిమా షూటింగ్ సమయంలో భానుమతి వచ్చిన సమయంలో ముందుగా బాలయ్య వెళ్లి కార్ డోర్ తీసి ఆమెను సెట్స్ లోకి తీసుకురావాలని కోరారు. తన కొడుకు అలా చేయడం ఒక మర్యాదపూర్వకంగా భావించేవారు అన్నగారు. అంతలా భానుమతిని గౌరవించేవారు. అలాగే చాలా విషయాల్లో ఒకరికి ఒకరు సహాయం చేసుకునే వారట

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది