Bheemla Nayak : పవర్ స్టార్ అంటే అంతే మరి.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ..

Authored By mallesh | The Telugu News | Published on: February 28, 2022, 4:00 pm

Bheemla Nayak : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ఈ పేరు వింటే ఇండస్ట్రీకే ఒక ఊపు వస్తుంది. హీరోల్లోనూ ఆయనకు ఫ్యాన్స్ ఉన్నారంటే ఆయనకు ఎంత క్రేజ్ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్ట్ చేసిన భీమ్లానాయక్ మూవీ ఇటీవల రిలీజ్ అయింది. ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా పవన్ ఫ్యాన్స్ సూపర్ డూపర్ హిట్ చేస్తున్నారు. కొవిడ్ తర్వాత థియేటర్స్‌లో సందడి వాతావరణం ఈ మూవీతో వచ్చింది. ఇక పవర్ స్టార్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో, ఇతర దేశాల్లోనూ ఫ్యాన్స్ ఉన్నారు.

విదేశాల్లో పవన్ మూవీస్‌కు ఎంత క్రేజ్ ఉందో ఇప్పటికే చాలా సార్లు ఫ్రూవ్ అయింది. తాజాగా భీమ్లానాయక్ మూవీతోనే అది మరో సారి రిపీట్ అవుతోంది. రిలీజ్ కు ముందు నుంచే మూవీపైనే చాలా అంచనాలు ఏర్పడ్డాయి.ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీ, తెలంగాణలో భీమ్లా నాయక్ మూవీ ఏ రేంజ్‌లో దూసుకుపోతున్నది. దీనికి తోడు ఓవర్ సీస్ లోనూ రికార్డులు సృష్టిస్తున్నది. రిలీజ్ కు ముందు రోజు యూఎస్‌లో ఈ మూవీ ప్రీయయర్స్ పడ్డాయి. ఈ ప్రీమియ‌ర్ షోల ద్వారా సుమారు 875,292 డాల‌ర్స్‌ రాబట్టిన మూవీ..

Bheemla Nayak creating a record of collections

Bheemla Nayak creating a record of collections

Bheemla Nayak : వసూళ్లలో దూసుకుపోతూ..

అదే హంగామా కంటిన్యూ చేస్తోంది. యూఎస్ మార్కెట్‌లో ఫస్ట్ డే 450,368 డాలర్స్ రాబట్టింది. రెండో రోజుకు వచ్చే సరికి 470,128 డాలర్స్, మూడో రోజుకు గానూ సుమారు 175,150 డాలర్స్ కలెక్ట్ చేసింది. మొత్తంగా చూస్తే మూడు రోజుల్లో 2 మిలియన్ డాలర్ మార్క్ దాటింది. మరోవైపు నైజాం ఏరియాలో ఈ మూవీ సూపర్ డూపర్ గా దూసుకుపోతున్నది. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి. బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు సృష్టించడం ఖాయమంటున్నారు పవన్ ఫ్యాన్స్.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp