
bhimla nayak is a young director who missed the chance to direct
Bheemla Nayak : కరోనా వలన ఇన్నాళ్లు పెద్ద సినిమాలు మూలన పడ్డాయి. ఇక మార్చి నుండి పెద్ద సినిమాల జాతర మొదలు కానుందని తెలుస్తుంది. ఈ క్రమంలో ప్రమోషన్ స్పీడ్ పెంచారు. అయితే సినిమాల నుండి పలు సాంగ్స్ విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తుండగా, కొందరు లీక్ రాయుళ్లు మాత్రం ముందే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పటికే ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో లీక్ అయింది.ఈ లీక్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.
అయితే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పాటను ఆదివారం సాయంత్రం విడుదల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ ఇప్పుడు లీక్ అయ్యాయి. అందులో పవన్ డాన్స్ స్టెప్స్ బయటికి వచ్చేసాయి. షూటింగ్ జరుగుతున్నపుడే కొందరు ఫోన్‌లో వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వాటిని షేర్ చేస్తున్న పవన్ అభిమానులు.. ఫైర్ అవుతున్నారు. దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దంటూ వేడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న
Bheemla Nayak Movie bit leaked
ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ విడుదలపై సందిగ్ధత కొనసాగుతుంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న భీమ్లా నాయక్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం. భీమ్లా నాయక్ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో పవన్ భీమ్లా నాయక్ ఏమేరకు బాలీవుడ్ లో విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
This website uses cookies.