Bheemla Nayak : బ‌డా సినిమాల‌కు లీకుల బెడ‌ద‌.. భీమ్లా నాయ‌క్‌కి కూడా లీకుల క‌ష్టాలు

Authored By Sam C | The Telugu News | Published on: February 14, 2022, 12:00 pm

Bheemla Nayak : క‌రోనా వ‌ల‌న ఇన్నాళ్లు పెద్ద సినిమాలు మూల‌న ప‌డ్డాయి. ఇక మార్చి నుండి పెద్ద సినిమాల జాత‌ర మొద‌లు కానుంద‌ని తెలుస్తుంది. ఈ క్ర‌మంలో ప్ర‌మోష‌న్ స్పీడ్ పెంచారు. అయితే సినిమాల నుండి ప‌లు సాంగ్స్ విడుద‌ల చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టిస్తుండ‌గా, కొంద‌రు లీక్ రాయుళ్లు మాత్రం ముందే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా ఫస్ట్ సింగిల్ కళావతి ఫిబ్రవరి 14న విడుదల చేయాలనుకున్నారు. ఇప్పటికే ప్రోమోను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఈ పాటకు సంబంధించిన లిరికల్ వీడియో లీక్ అయింది.ఈ లీక్‌తో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.

అయితే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సంఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ పాటను ఆదివారం సాయంత్రం విడుద‌ల చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.ఇప్పుడు భీమ్లా నాయక్ సినిమా విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈ సినిమాలోని టైటిల్ సాంగ్‌కు సంబంధించిన కొన్ని సీన్స్ ఇప్పుడు లీక్ అయ్యాయి. అందులో పవన్ డాన్స్ స్టెప్స్ బయటికి వచ్చేసాయి. షూటింగ్ జరుగుతున్నపుడే కొందరు ఫోన్‌లో వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. వాటిని షేర్ చేస్తున్న పవన్ అభిమానులు.. ఫైర్ అవుతున్నారు. దయచేసి ఇలాంటివి ఎంకరేజ్ చేయొద్దంటూ వేడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా సాగర్ కే చంద్ర తెరకెక్కిస్తున్న

Bheemla Nayak Movie bit leaked

Bheemla Nayak Movie bit leaked

Bheemla Nayak : లీకుల స‌మ‌స్య‌…

ఈ సినిమాకు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ భీమ్లా నాయక్ విడుదలపై సందిగ్ధత కొనసాగుతుంది. ఫిబ్రవరి 25 లేదా ఏప్రిల్ 1న భీమ్లా నాయక్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే. భీమ్లా నాయక్ హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం. భీమ్లా నాయక్ చిత్ర నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ విషయాన్ని తెలియజేశారు. దీంతో పవన్ భీమ్లా నాయక్ ఏమేరకు బాలీవుడ్ లో విజయం సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Sam C

No bio available for this author.

  1. "Meenakshi Chaudhary : మీనాక్షి చౌదరి హనోయ్ వెకేషన్.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫొటోలు!"

  2. "Avinash Reddy : వేల కొద్దీ డాక్యుమెంట్లతో ఈడీ ముందుకొచ్చిన అవినాష్ రెడ్డి.. తాడేపల్లిలో మొదలైన టెన్షన్..!"

  3. "Ranabaali Movie First Review : రణబాలి మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ..!"

  4. "Vijayasai Reddy : వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంపై రచ్చ.. వైసీపీ, టీడీపీ మౌనంపై విజయసాయిరెడ్డి సంచలన ఫైర్..!"

  5. "Rahul Gandhi : తెలంగాణ కాంగ్రెస్ ‘ఓటు చోరీ’ సభలో రాహుల్ గాంధీ బిగ్ మిస్టేక్.. పార్టీకి సెల్ఫ్ గోల్ తప్పదా..?"

  6. "Ysrcp : కాకినాడ మేయర్ రేసులో ముద్రగడ క్రాంతి.. కూటమికి చెక్ పెట్టేందుకు వైసీపీ బిగ్ స్కెచ్ ..?"

  7. "Khairatabad By Election : ఖైరతాబాద్ ఉప ఎన్నిక సర్వే.. ఏ పార్టీ లీడ్ లో ఉందంటే..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp