Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కొత్త తేది ఫిక్స్.. ఎప్పుడో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి కొత్త తేది ఫిక్స్.. ఎప్పుడో తెలుసా?

 Authored By sandeep | The Telugu News | Updated on :22 February 2022,11:00 am

Bheemla Nayak : ఈ ఏడాది పెద్ద సినిమాలు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించ‌లేదు. తొలిసారి భీమ్లా నాయ‌క్ వంటి పెద్ద సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌డంతో అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్ర‌వ‌రి 25న ఈ సినిమా విడుద‌ల కానుండ‌గా, చిత్ర ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఫిబ్ర‌వ‌రి 21న ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు. తెలంగాణ నుంచి మంత్రులు కేటీఆర్, తలసాని ముఖ్య అతిథులుగా రానున్నట్లు ప్రకటించారు కూడా. అయితే చివరి నిమిషంలో ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి మేకపాటి ఆకస్మిక మరణంతో వాయిదా వేసారు.

‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో కీలక బాధ్యతల్లో ఉన్న శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారు హఠాన్మరణం వల్ల నెలకొన్న ఈ విషాద సమయంలో భీమ్లా నాయక్ సినిమా వేడుక చేసుకోవడానికి నా మనసు అంగీకరించడం లేదు. అందుకే నేడు జరగవలసిన భీమ్లా నాయక్ ప్రి రిలీజ్ కార్యక్రమాన్ని వాయిదా వేయాలని నిర్ణయించాం. ఈ వేడుక త్వరలోనే జరుగుతుంది. వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ తెలియచేస్తుంది..’ అంటూ పవన్ తెలిపారు.అయితే తిరిగి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడు జ‌రుపుతారా అనే అనుమానాలు అంద‌రిలో ఉండ‌గా, ఓ డేట్ ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది.

bheemla nayak pre release event time fixed

bheemla nayak pre release event time fixed

Bheemla Nayak : భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం ఫిక్స్..

యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదికగా, ఫిబ్రవరి 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఈ ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు నేడు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయనేది ఫిలిం నగర్ టాక్. సాగర్ కే చంద్ర తెరకెక్కించిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించింది. ఈ సినిమాకు త్రివిక్రమ్ మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. రానా దగ్గుబాటి మరో హీరోగా నటించాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా పడినా.. ట్రైలర్ మాత్రం అనుకున్నట్లుగానే విడుద‌ల చేశారు. ఇందులో ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ ఆస‌క్తిని రేకెత్తించాయి.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది