Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మళ్ళీ బ్రేకు వేస్తాడా..?
Pawan Kalyan : పవన్ కళ్యాణ్ మళ్ళీ బ్రేకు వేస్తాడా..? అంటే ఏ విషయంలో అని అందరికీ మరో ప్రశ్న మనసులో కలగొచ్చు. ప్రత్యేకంగా చెపాల్సిన పనేముంది.. సినిమాల విషయంలోనే. నాకు సినిమాలొద్దు. ఇక రాజకీయాలలోనే కొనసాగుతా నని వెళ్ళిన పవన్ కళ్యాణ్ జనం కోసం జనసేన పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో కూడా పోటీ చేసిన విషయం తెలిసిందే. ఆయనకు కొన్ని సీట్లైనా దక్కితే కథ, స్క్రీన్ ప్లే వేరేలా ఉండేదేమో. కానీ, అది సాధ్యపడలేదు. పవన్, ఆయన జన సైనికులు అనుకున్నది ఒకటైతే ఫలితం ఒకటొచ్చింది.
దాంతో అందరూ మళ్ళీ సినిమాలలోకి రావాలని పట్టుపట్టారు. పవన్ కూడా చేసేదీ లేక సరే కొన్ని సినిమాలు చేసుకుందాం..మళ్ళీ ఎలక్షన్స్ అంటే 5 ఏళ్ళు ఉంది కదా .. అని ఆలోచించుకున్నారేమో గానీ, చక చకా అరడజను సినిమాలను చేస్తున్నట్టు ప్రకటించారు. పవన్ దూకుడు చూసి అందరూ ఏడాదిలో మూడు సినిమాలనైనా పూర్తి చేస్తారని గట్టిగా నమ్మారు. పవన్ కూడా అదే ఊపుతో సినిమాలు ఒప్పుకు న్నారు. కానీ, కరోనా ఆయన అనుకున్న ప్లాన్స్ అన్నీ తారుమారు చేసింది. ఎంత ప్రయత్నించినా వేవ్స్ మీద వేవ్స్ వచ్చి పడి పవన్ సినిమా షూటింగులకు బ్రేక్ వేశాయి.ఆ దెబ్బకు అనుకున్న సమయానికి సినిమాలు రిలీజ్ కాలేదు.

will pawan kalyan give break again
Pawan Kalyan: దాని కోసమే ఫ్యాన్స్ వేయిటింగ్ ఇక్కడ.
అనూహ్యంగా త్రివిక్రమ్ చెప్పడంతో భీమ్లా నాయక్ సినిమాను కమిటై దాన్ని ముందు కంప్లీట్ చేసేందుకు హరిహర వీరమల్లు సినిమాను పక్కన పెట్టారు. లేదంటే ఈ పాటికి అల్లు అర్జున్, ఎన్.టి.ఆర్, రామ్ చరణ్‌ల కంటే ముందు పాన్ ఇండియన్ సినిమాతో పవనే వచ్చేవారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఒకేసారు అటు బ్యాలెన్స్ ఉన్న వీరమల్లు సినిమాను, ఇటు హరీశ్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీస్ వారి నిర్మించే భవదీయుడు భతగ్‌సింగ్ సినిమాను పూర్తి చేయాలని గట్టిగా నిర్ణయించుకొని రంగంలోకి దిగాడు. మరి ఈసారైనా పవన్ ప్లాన్స్ వర్కౌట్ అవుతాయా..లేక ఏవో అడ్డములొచ్చి మళ్ళీ బ్రేకు వేస్తాడా చూడాలి. నిజంగానే గ్యాప్ లేకుండా షూటింగ్ జరిగితే..నాలుగు నెలల్లోనే రెండు సినిమాలు పెద్ద గ్యాప్ లేకుండా రిలీజ్ అవుతాయి. దాని కోసమే ఫ్యాన్స్ వేయిటింగ్ ఇక్కడ.