Big Boss 7 Telugu : ఈసారి వెరైటీ కంటెస్టెంట్స్ తో ముస్తాబవుతున్న బిగ్ బాస్ సీజన్ 7..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Big Boss 7 Telugu : ఈసారి వెరైటీ కంటెస్టెంట్స్ తో ముస్తాబవుతున్న బిగ్ బాస్ సీజన్ 7..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :21 June 2023,11:00 am

Big Boss 7 Telugu  : ప్రపంచవ్యాప్తంగా టెలివిజన్ రంగంలో మంచి పాపులారిటీ సంపాదించిన షో బిగ్ బాస్ రియాల్టీ షో. ఈ షో ద్వారా ఎంతోమంది గుర్తింపు సంపాదించుకొని… ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. సెలబ్రిటీ అయినవాళ్లు ఈ షోలో పాల్గొని తమ ఆట తీరు వల్ల కెరియర్ పాడు చేసుకున్న వాళ్లు కూడా ఉన్నారు. బిగ్ బాస్ షో ఓ కంటెస్టెంట్ కి ఎంత మేలు చేస్తుందో… అదే రీతిలో కీడు కూడా చేస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇండియాలో మొట్టమొదటిసారిగా హిందీలో షో ప్రారంభమైంది. హిందీలో టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ రియాల్టీ షో మంచి ఆదరణ దక్కించుకుంది. దీంతో దక్షిణాదిలో చాలాకాలం తర్వాత హిందీలో కంటే లేటుగా స్టార్ట్ అయింది. తెలుగులో ఇప్పటివరకు 6 సీజన్లు ముగిసాయి.

ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ చాలా వెరైటీగా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే లాస్ట్ సీజన్ ఫ్లాప్ కావడంతో.. పాటు హైకోర్టు దాక విషయం వెళ్లడంతో సీజన్ సెవెన్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టారు. ఈసారి ఎలాగైనా సక్సెస్ కొట్టాలని షో నిర్వాహకులు భావిస్తున్నారు. దీనిలో భాగంగా బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వెరైటీ కంటెస్టెంట్స్ అనగా బాగా పాపులర్ అయిన సెలబ్రిటీలను పారిదోషకం ఎక్కువ ఇచ్చి మరి తీసుకుంటున్నట్లు సమాచారం. వివాదాస్పద వ్యక్తులను, విడాకులు తీసుకున్న ప్రముఖ జంటలను… కొత్తజంటలను హౌస్ లోకి తీసుకొస్తున్నారని టాక్ నడుస్తోంది. ఈ లిస్టులో సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్, ఆయన భార్య తేజస్విని, మహేష్ బాబు కాళిదాసు, సిద్దార్థ్ వర్మ…యాంకర్స్ దీపికా పిల్లి, రష్మీ గౌతమ్, విష్ణు ప్రియ ఉన్నట్లు టాక్.

big boss 7 telugu contestants list

big boss 7 telugu contestants list

మంగ్లీ, హేమచంద్ర, బుల్లెట్ బండి ఫేమ్ మోహన భోగరాజు, సాకేత్ కొమండూరి వంటి సింగర్స్ లిస్టులో ఉన్నట్టు సమాచారం. అలానే విడిపోయిన సింగర్ నోయల్, ఆయన మాజీ భార్య ఎస్తేర్ నోరోన్హా కూడా హౌజ్ లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరితో పాటు యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సిన్హా, సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, శోభా శెట్టి, మిత్రా శర్మ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఈటీవీ ప్రభాకర్, కొరియోగ్రాఫర్ పండు, జబర్దస్త్ అప్పారావు, న్యూస్ రీడర్ ప్రత్యూష, డాన్సర్ శ్వేతా నాయుడు, ట్రాన్స్ జెండర్ తన్మయి, మోడల్ సాయి రోనాక్, కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఐతే ఈ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున బదులు రానా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. త్వరలోనే సీజన్ 7కి సంబంధించి అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది