Shobha shetty : రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిజస్వరూపం బయటపెట్టిన శోభా శెట్టి..!
Shobha shetty : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. ఎవరు టైటిల్ గెలుస్తారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియక జనాలలో ఆసక్తి నెలకొంది. ఈసారి ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఊహించడం కష్టం అయింది. ఇక నిన్న జరిగిన ఎలిమినేషన్స్ లో శోభా శెట్టి ఔట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకి బిగ్ బాస్ శోభాని 14 వారాల దాకా తీసుకొచ్చాడు. 14 […]
ప్రధానాంశాలు:
Shobha shetty : రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిజస్వరూపం బయటపెట్టిన శోభా శెట్టి..!
Shobha shetty : ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 7 చాలా రసవత్తరంగా కొనసాగుతుంది. ఎవరు టైటిల్ గెలుస్తారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియక జనాలలో ఆసక్తి నెలకొంది. ఈసారి ఉల్టా పుల్టా సీజన్ కావడంతో ఎవరు ఎలిమినేట్ అవుతారో ఊహించడం కష్టం అయింది. ఇక నిన్న జరిగిన ఎలిమినేషన్స్ లో శోభా శెట్టి ఔట్ అయ్యారు. ఎప్పుడెప్పుడు ఎలిమినేట్ అవుతుందా అని ఎదురుచూసిన ప్రేక్షకులకి బిగ్ బాస్ శోభాని 14 వారాల దాకా తీసుకొచ్చాడు. 14 వారాలు ఆమె బిహేవియర్ ను చూస్తే శోభ శెట్టి కంటే ఆ మోనిత నే బెస్ట్ అన్నట్లు తనని తాను దిగజారి చేసుకుంది. బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టి సేవ్ అయిన ప్రతిసారి జనం ఈమె ఎలా సేవ్ అవుతుందా అని తల పట్టుకునేవారు. ఈ రేంజ్ లో ఆమెపై నెగిటివిటీ ఏర్పడింది.
ఛీ ఛీ ఇలాంటి ఆడపిల్ల మా ఇంట్లో కనుక ఉంటే పీక మీద కాలేసి తొక్కేసేవాడిని అని శివాజీ మనసులో మాట కక్కేసిన బిగ్బాస్ చూసే చాలామంది ఆడియన్స్ మాట కూడా ఇదే అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అంతలా తన బిహేవియర్ తో శోభ అందరితో ఛీ కొట్టించుకుంది. అయినా కూడా బిగ్ బాస్ ఆమెను సపోర్ట్ చేసి 14 వారాలు దాకా తీసుకువచ్చారు. నిజానికి ప్రతి సీజన్లో ఫినాలే వచ్చేసరికి జనం బీభత్సంగా పోటీపడి ఓట్లు వేసేవారు. కానీ శోభ దెబ్బకి జనం ఓట్లు వేయడమే మానేశారు. శోభ శెట్టి నామినేషన్ లో ఉన్న ప్రతిసారి ఆమె లిస్ట్ ఓటింగ్ లో కనిపించేది అన్ ఫీషియల్ పోస్ట్ లో కానీ ఆదివారం నాటి ఎపిసోడ్ నాగార్జున మాత్రం శోభా శెట్టి సేఫ్ అనేసరికి ఓట్లు వేసిన జనాల్లో అసలు ఆమె ఎలా సేవ్ అవుతుందా అని తలలు పట్టుకునే వాళ్ళు.
మొత్తానికైతే శోభాను సేవ్ చేసే అగ్రిమెంట్ కార్యక్రమం ఈ వారంతో ముగిసిందో ఏమో కానీ ఎట్టకేలకు శోభా శెట్టి ఎలిమినేట్ చేశారు. ఇక బయటికి వచ్చాక శోభా శెట్టి మీడియాతో మాట్లాడారు. నేను ఎవరి వల్ల ఎలిమినేట్ కాలేదని చెప్పారు. బిగ్బాస్ హౌస్ లో నేను ఎవరిని మిస్ అవ్వలేదని, బయట ఉన్న నా ఫ్యామిలీని మాత్రమే మిస్ అయ్యానని చెప్పారు. బిగ్బాస్ లో నా ఫేవరెట్ ఎవరూ లేరు అని, బిగ్ బాస్ లో ఎవరు విన్ అయితారో నాకు తెలియదని ఆమె అన్నారు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఐదుగురు కంటెస్టెంట్ లు మాత్రమే ఉన్నారు. వీరిలో ఎవరు టైటిల్ విన్నర్ అవుతారో చివరి వరకు టెన్షనే. శివాజీ, పల్లవి ప్రశాంత్ , యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్ వీరిలో ఎవరు టైటిల్ గెలుస్తారో చూడాలి.