Big Breaking : బిగ్ బ్రేకింగ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి మృతి..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Big Breaking : బిగ్ బ్రేకింగ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సుచిత్ర చంద్రబోస్ తండ్రి మృతి..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :7 January 2023,10:55 am

Big Breaking : టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రముఖ గేయ రచయితలలో చంద్రబోస్ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు చంద్రబోస్ పాటలు అందించడం జరిగింది. ఇక చంద్రబోస్ భార్య సుచిత్ర చంద్రబోస్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్నారు. అయితే ఈ దంపతుల కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. విషయంలోకి వెళ్తే సుచిత్ర చంద్రబోస్ తండ్రి చాంద్ బాషా(92) రాత్రి హైదరాబాద్ మణికొండలో మృతి చెందారు.

చంద్ర బోస్ మామ చాంద్ బాషా దక్షిణాది సినిమా రంగంలోఅనేక సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశారు. ఈయనకి ముగ్గురు కుమార్తెలు… ఒక కొడుకు ఉన్నారు. తెలుగులో ఖడ్గ తిక్కన్న, బంగారు సంకెళ్లు, స్నేహమేరా జీవితం, మానవుడే దేవుడు సినిమాలకు మ్యూజిక్ అందించారు. ఇక కనడంలో అమర భారతి, చెడిన కిడి కన్నడ వంటి అనేక సినిమాలకు కూడా సంగీతం అందించడం జరిగింది.

Big Breaking in Suchitra Chandrabose father passes away

Big Breaking in Suchitra Chandrabose father passes away

ఈ క్రమంలో చాంద్ భాష మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీలో సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్ర బోస్ ఫ్యామిలీకి సానుభూతి తెలియజేస్తున్నారు. కాగా ఈరోజు ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో చాంద్ భాష అంతిక్రియలు జరగనున్నాయి. తెలుగు ఇండస్ట్రీ ప్రముఖులు మాత్రమే కాదు దక్షిణాది సినిమా రంగానికి చెందిన పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం చాంద్ భాష మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది