బిగ్ బాస్ షో ఫినాలే స్టేజ్ మీద చిరంజీవి, నాగార్జున వచ్చారంటే ఇక చెప్పాల్సిన పని లేదు. అక్కడ మాటల ప్రవాహాం, టాపిక్ ఏదై ఉంటుందా? అని అందరికీ ఇట్టే తెలిసిపోతోంది. మూడో సీజన్‌లో ఇంతే.. ఇద్దరూ తమ వయసు, గ్లామర్ గురించి ఒకరిపై ఒకరు బిస్కెట్లు వేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే. చిరు వచ్చీ రాగానే.. నాగార్జున మొదలెట్టేశాడు. మీ నడుము సైజ్ ఎంతంటూ అడిగేశాడు. అది మా ఆవిడకే తెలియాలంటూ చిరు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు చెప్పేశాడనుకోండి.
ఆ తరువాత నాగార్జున ఫిట్‌నెస్ అందంపై చిరు కామెంట్ చేశాడు. నాగార్జున కూడా మా 60 క్లబ్‌లోకి వచ్చాడని ఆనందించానంటూ(అంటే నాగార్జున కూడా మూసలోడు అయ్యాడనే అర్థంలో కావచ్చు) చిరు చెప్పుకొచ్చాడు. వయసు దగ్గరికి వచ్చే సరికి వినకండని నాగ్ కంటెస్టెంట్లకు సైగ చేశాడు. అయితే నాగార్జునది ఇటివలే ఓ స్టిల్ చూశాను.. కడుపు రగిలిపోయింది.. ఇంకెన్నాళ్లు ఎంత మందిని ఏడిపిస్తావ్ అని అనుకున్నాను. అంత ఫిట్‌గా ఎలా ఉంటావ్.. ఎంతైనా నవ మన్మథుడు అంటూ చిరు ప్రశంసలతో ముంచెత్తాడు.
మీరు మాత్రం ఏమైనా తక్కువా? అంటూ నాగ్ మళ్లీ మొదలెట్టాడు. ఫుల్ ఫిట్‌గా అయ్యారు.. చాలా స్లిమ్‌గా ఉన్నారంటూ నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ లాక్డౌన్‌లో బాగా డైట్ మెయింటైన్ చేసి ఏదో గ్రాముల్లో కొంచెం అలా తగ్గానంటూ చిరు కౌంటర్లు వేశాడు. మాకు తెలుసు లేంటి.. సినిమాల మీద సినిమాలు చేస్తూ.. మళ్లీ రూలింగ్ మొదలెట్టేశారంటూ చిరు, నాగ్ భజనలు అలా కొనసాగుతూనే వచ్చాయి. చివరకు ఫినాలే స్టేజ్ మీద రన్నర్, విన్నర్‌కు దక్కాల్సిన మర్యాదే కనిపించలేదు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.