షరా మామూలే ఒకరి భజన మరొకరు.. చిరు నాగ్ యవ్వారం మారదా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

షరా మామూలే ఒకరి భజన మరొకరు.. చిరు నాగ్ యవ్వారం మారదా?

బిగ్ బాస్ షో ఫినాలే స్టేజ్ మీద చిరంజీవి, నాగార్జున వచ్చారంటే ఇక చెప్పాల్సిన పని లేదు. అక్కడ మాటల ప్రవాహాం, టాపిక్ ఏదై ఉంటుందా? అని అందరికీ ఇట్టే తెలిసిపోతోంది. మూడో సీజన్‌లో ఇంతే.. ఇద్దరూ తమ వయసు, గ్లామర్ గురించి ఒకరిపై ఒకరు బిస్కెట్లు వేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే. చిరు వచ్చీ రాగానే.. నాగార్జున మొదలెట్టేశాడు. మీ నడుము సైజ్ ఎంతంటూ అడిగేశాడు. అది మా ఆవిడకే తెలియాలంటూ చిరు తప్పించుకునే ప్రయత్నం […]

 Authored By uday | The Telugu News | Updated on :21 December 2020,7:57 am

బిగ్ బాస్ షో ఫినాలే స్టేజ్ మీద చిరంజీవి, నాగార్జున వచ్చారంటే ఇక చెప్పాల్సిన పని లేదు. అక్కడ మాటల ప్రవాహాం, టాపిక్ ఏదై ఉంటుందా? అని అందరికీ ఇట్టే తెలిసిపోతోంది. మూడో సీజన్‌లో ఇంతే.. ఇద్దరూ తమ వయసు, గ్లామర్ గురించి ఒకరిపై ఒకరు బిస్కెట్లు వేసుకున్నారు. ఇప్పుడు కూడా అంతే. చిరు వచ్చీ రాగానే.. నాగార్జున మొదలెట్టేశాడు. మీ నడుము సైజ్ ఎంతంటూ అడిగేశాడు. అది మా ఆవిడకే తెలియాలంటూ చిరు తప్పించుకునే ప్రయత్నం చేశాడు. చివరకు చెప్పేశాడనుకోండి.

Bigg Boss 4 Telugu Finale Chiranjeevi nagarjuna praise each other

Bigg Boss 4 Telugu Finale Chiranjeevi nagarjuna praise each other

ఆ తరువాత నాగార్జున ఫిట్‌నెస్ అందంపై చిరు కామెంట్ చేశాడు. నాగార్జున కూడా మా 60 క్లబ్‌లోకి వచ్చాడని ఆనందించానంటూ(అంటే నాగార్జున కూడా మూసలోడు అయ్యాడనే అర్థంలో కావచ్చు) చిరు చెప్పుకొచ్చాడు. వయసు దగ్గరికి వచ్చే సరికి వినకండని నాగ్ కంటెస్టెంట్లకు సైగ చేశాడు. అయితే నాగార్జునది ఇటివలే ఓ స్టిల్ చూశాను.. కడుపు రగిలిపోయింది.. ఇంకెన్నాళ్లు ఎంత మందిని ఏడిపిస్తావ్ అని అనుకున్నాను. అంత ఫిట్‌గా ఎలా ఉంటావ్.. ఎంతైనా నవ మన్మథుడు అంటూ చిరు ప్రశంసలతో ముంచెత్తాడు.

మీరు మాత్రం ఏమైనా తక్కువా? అంటూ నాగ్ మళ్లీ మొదలెట్టాడు. ఫుల్ ఫిట్‌గా అయ్యారు.. చాలా స్లిమ్‌గా ఉన్నారంటూ నాగ్ కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ లాక్డౌన్‌లో బాగా డైట్ మెయింటైన్ చేసి ఏదో గ్రాముల్లో కొంచెం అలా తగ్గానంటూ చిరు కౌంటర్లు వేశాడు. మాకు తెలుసు లేంటి.. సినిమాల మీద సినిమాలు చేస్తూ.. మళ్లీ రూలింగ్ మొదలెట్టేశారంటూ చిరు, నాగ్ భజనలు అలా కొనసాగుతూనే వచ్చాయి. చివరకు ఫినాలే స్టేజ్ మీద రన్నర్, విన్నర్‌కు దక్కాల్సిన మర్యాదే కనిపించలేదు.

uday

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది