Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ 5 తెలుగు నాల్గో వారం రచ్చ.. నామినేషన్‌లోకి వచ్చింది ఎవరంటే?

Authored By Cinema Desk | The Telugu News | Updated on : 27 September 2021, 11:00 am

Bigg Boss 5 Telugu బిగ్ బాస్ 5 తెలుగు ఇంట్లో మూడు వారాలు గడిచాయి. ఇప్పటికి ముగ్గురు కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. మొదటి వారంలో సరయు, రెండో వారంలో ఉమ ఎలిమినేట్ అయ్యారు. ఇక నిన్నటి ఎపిసోడ్‌లో మూడో కంటెస్టెంటుగా లహరి బయటకు వచ్చింది. లహరి ఎలిమినేషన్ జనాలకు ముందే తెలిసిపోయింది. కానీ బిగ్ బాస్ ఇంట్లోని కంటెస్టెంట్లకు మాత్రం అది షాకింగ్. ఎందుకంటే అంత ఆరోపణలు చేసిన ప్రియ ఎలిమినేట్ అవుతుందని అంతా భావించారు. కానీ చివరకు లహరి బయటకు వచ్చేసింది.

Bigg Boss 5 Telugu 4th Week Nominations List

Bigg Boss 5 Telugu 4th Week Nominations List

నాల్గో వారం నామినేషన్ లిస్ట్ Bigg Boss 5 Telugu

అదేంటి? అంటూ అందరూ తెల్లమొహం వేసేశారు. రవి నోట వెంట మాట రాలేదు. లోబో అంచనాలు తప్పు అయ్యాయని చెప్పుకొచ్చింది లహరి. అలా మొత్తానికి లహరి ఎలిమినేషన్‌తో కంటెస్టెంట్లు వాస్తవాన్ని తెలుసుకుంటారేమో. లోపల జరిగేది.. వారు ఊహించుకునేది వేరు. బయట జనాలు అనుకుంటుంది వేరు అని తెలుసుకుంటారు. అలా మొత్తానికి మూడు వారాలు పూర్తయ్యాయి. ఈ వారంలో రవి ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది.

Anchor Ravi Priya Video Out In Bigg Boss 5 Telugu

Anchor Ravi Priya Video Out In Bigg Boss 5 Telugu

అయితే ఈ నాల్గో వారంలో నామినేషన్ల రచ్చ మామూలుగా ఉండబోవడం లేదు. ఈ మేరకు అదిరిపోయే లిస్ట్ ఒకటి బయటకు వచ్చింది. నేడు నామినేషన్ ప్రక్రియ జరగనుంది. నామినేట్ అయిన సభ్యుల లిస్ట్ ఆల్రెడీ బయటకు వచ్చింది. షన్ను, ప్రియాంక, శ్రీరామచంద్ర, శ్వేతా వర్మ, హమీద, విశ్వ, మానస్ ఇలా ఏడుగురు నామినేట్ అయినట్టు తెలుస్తోంది. అయితే ఈ లెక్కన ఈ సారి శ్వేతా వర్మ, హమీదల్లోంచి ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యేట్టు కనిపిస్తోంది.

 

Advertisement

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి