Bigg Boss 5 Telugu : కంటెస్టెంట్ల లిస్ట్ ఇదే.. ఇక ఫిక్స్ అయిపోండి!

Authored By Cinema Desk | The Telugu News | Updated on: September 5, 2021, 7:58 pm

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ షో ఐదో సీజన్ ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. ఇప్పటికే లీకుల మీద లీకులు వచ్చేశాయి. కంటెస్టెంట్ల పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే అందులో చాలానే మార్పులు వచ్చాయి. కొందరు క్వారంటైన్ వరకు వచ్చారు. అందులో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చిందనే టాక్ ఉంది. అయితే మత్తానికి బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లే కంటెస్టెంట్లు మాత్రం ఇప్పుడు ఫిక్స్ అయ్యారు.

Bigg Boss 5 Telugu Contestants List

Bigg Boss 5 Telugu Contestants List

ఇక ఈ లిస్ట్‌లో ఎలాంటి మార్పులు ఉండవని లీకులు వస్తున్నాయి. తాజాగా వదిలిన ఈ లిస్ట్ చూస్తే ఈ సారి మామూలుగా ఉండదని తెలుస్తోంది. ఇందులో లోబో, యాంకర్ రవి, షణ్ముఖ్ జశ్వంత్, మానస్ (కోయిలమ్మ హీరో), ప్రియాంక సింగ్ (జబర్దస్త్ ట్రాన్స్ జెండర్), సరయు (యూట్యూబర్), లహరి శరి, జశ్వంత్ పాదాల, నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, ఆర్జే కాజల్, ఉమా దేవీ, సింగర్ శ్రీరామ చంద్ర, వీజే సన్నీ, సిరి హన్మంత్, నటి ప్రియ, శ్వేతా వర్మ, విశ్వ ఇలా అందరూ ఈ సారి రచ్చ రచ్చ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Bigg Boss 5 Telugu Contestants List

Bigg Boss 5 Telugu Contestants List

అయితే ఈ సారి మాత్రం లోబో, యాంకర్ రవి, కార్తీకదీపం పావుశేరు భాగ్యం ఉమాదేవీ, సరయు వంటి వారు హైలెట్ అయ్యేలా కనిపిస్తోంది. ఇక సరయు అయితే తన బోల్డ్ డైలాగ్‌లు, బీప్ మాటలతో యూట్యూబ్‌లో దుమ్ములేపింది. మరి బిగ్ బాస్ ఇంట్లో ఎలా ఉంటుందో చూడాలి. ఇక యాంకర్ రవి గురించి ఇప్పటికే రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సీజన్ మొత్తానికి హయ్యస్ట్ పెయిడ్ కంటెస్టెంట్ అంటూ టాక్. మరి వీటిలో ఎంత నిజముందో బిగ్ బాస్ టీంకు, రవికే తెలియాలి.

Cinema Desk

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp