Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ కాజల్ మొత్తం ఎంత రెమ్యూనరేషన్ అందుకుందంటే..?

Advertisement

Bigg Boss 5 Telugu : బిగ్‌బాస్ ఎంటర్‌టైన్మెంట్ మొత్తానికి చివరి అంకానికి చేరుకుంది. ఇంకొక వారంలో బిగ్‌బాస్‌ షోకు ఎండ్ కార్డు పడనుంది. 19 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం ఐదుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ సీజన్ -5లో టైటిల్ విన్నర్ ఎవరు కానున్నారో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ‘సన్నీ’ ఈ సీజన్ విన్నర్‌ అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. షణ్ముక్ సెకండ్ ప్లేస్ లో ఉంటాడని కథనాలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

బిగ్‌బాస్ హౌస్‌లో ఇప్పటివరకు సరయు, లహరి షారీ, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, శ్వేతా వర్మ, ప్రియ, హమీదా ఖాతూన్, లోబో, విశ్వ, యాంకర్ రవి, ప్రియాంక, లేటెస్ట్‌గా కాజల్ కూడా ఎలిమినేట్ అయ్యింది. అయితే, వీరంతా తమకు తోచిన విధంగా గేమ్ ఆడారు. వీరికి పెద్దగా అభిమానుల నుంచి ఆదరణ లభించలేదని తెలుస్తోంది. జస్వంత్ మాత్రం అనారోగ్య సమస్య కారణంగా హౌస్ వీడాల్సి వచ్చింది. ఈ షో ప్రారంభంలో 19 మంది సభ్యులు ఉండగా, ప్రస్తుతం ఐదుగురు మాత్రమే మిగిలారు. ఒక్కోవారం ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వచ్చారు.

Advertisement
Bigg Boss 5 Telugu  kajal is the total amount of remuneration received
Bigg Boss 5 Telugu  kajal is the total amount of remuneration received

Bigg Boss 5 Telugu : కాజల్ మధ్యలోనే వెనుదిరిగినా..

అయితే, తాజాగా ఎలిమినేట్ అయిన కాజల్ 14 వారాలు బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగింది. ఈమె హౌస్‌లో ఉన్నప్పుడు టైటిల్ గెలిస్తే వచ్చిన డబ్బులతో ఏం చేస్తావని హెస్ట్ నాగార్జున సభ్యులందరినీ అడిగారు. అప్పుడు తన కుటుంబానికి రూ.30 లక్షల అప్పు ఉందని అది తీర్చి మిగతా డబ్బులతో ఫ్యూచర్ ప్లాన్ చేస్తానని తెలిపింది. అయితే, టైటిల్ గెలవకుండానే కాజల్ వెళ్లిపోవడంతో ఆమె కోరిక తీరుతుందా అని అంతా అనుకున్నారు. కానీ, కాజల్‌కు బిగ్‌బాస్ మొత్తం రూ.30 లక్షలు ముట్టజెప్పారని తెలుస్తోంది. దీంతో ఆమె అప్పు తీరిపోనుంది. కాజల్‌తో వారానికి రూ.2లక్షల చొప్పున బిగ్‌బాస్ నిర్వాహకులు ఒప్పందం చేసుకున్నట్టు తెలిసింది. హౌస్ నుంచి మధ్యలోనే వెళ్లినా కాజల్ అప్పు మాత్రం తీరుతుందని నెజటిన్లు అనుకుంటున్నారు.

Advertisement
Advertisement