Bigg Boss 5 Telugu : అటువంటి వారికి ఆదర్శం నువ్వు.. ప్రియాంకను ప్రశంసించిన నాగబాబు..

Authored By mallesh | The Telugu News | Published on: December 7, 2021, 7:40 pm

Bigg Boss 5 Telugu : బుల్లితెర ప్రేక్షకులకు వినోదం అందించడంలో ముందుండే షో ‘బిగ్ బాస్’ అని చెప్పొచ్చు. అన్ని భాషల్లో ప్రసారమవుతున్న ఈ షో తెలుగు భాషలో ఐదో సీజన్ కొనసాగుతోంది. ఇందులో పార్టిసిపేట్ చేసిన తర్వాత కంటెస్టెంట్స్ క్రేజ్ అమాంతగా పెరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కంటెస్టెంట్స్ ఈ షోలో పార్టిసిపేట్ చేసి తమ పాపులారిటీని ఇంకా పెంచేసుకుని, స్టార్స్ అయిపోతున్నారు. అలా కెరీర్ నిలదొక్కుకున్న వారు చాలా మందే ఉన్నారు. ఈ కోవకు చెందిన కంటెస్టెంటే ప్రియాంకా సింగ్ అలియాస్ పింకీ. ‘బిగ్ బాస్’తో ఈమె క్రేజ్ బాగా పెరిగిపోయింది.

ప్రియాంక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమెకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ట్రాన్స్‌జెండర్‌గా ‘బిగ్‌బాస్‌’ హౌస్‌లో అడుగుపెట్టిన ప్రియాంక.. అందరి అంచనాలను తారుమారు చేసి 13 వారాల పాటు హౌస్‌లో ఉంది. గతంలో పార్టిసిపేట్ చేసిన ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి కంటే ఎక్కువ రోజులు హౌస్‌లో ఉండి తనకంటూ ఓ ప్రత్యేకత చాటుకుంది ‘బిగ్ బాస్’ రియాలిటీ షో స్టార్టింగ్‌లో ప్రియాంకకు మద్దతు తెలిపిన నాగబాబు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమెను సపోర్ట్ చేశారు.ఇటీవల ప్రియాంకా సింగ్ మెగా బ్రదర్ నాగబాబును మర్యాద పూర్వకంగా కలిసి, ఆయన ఆశీర్వాదం తీసుకుంది.

Bigg boss 5 telugu nagendra babu praised bigg boss 5 telugu contestant priyanka

Bigg boss 5 telugu nagendra babu praised bigg boss 5 telugu contestant priyanka

Bigg Boss 5 Telugu : ప్రియాంకకు అభిమానుల ఘన స్వాగతం..

ఈ సందర్భంగా నాగబాబు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్నో అసమానతలు, అడ్డంకులు, అవమానాలను ఎదుర్కొని ప్రియాంక గొప్ప స్థానం సంపాదించకుందని, ప్రజల హృదయాలలో ఆమె ఎప్పటికీ నిలిచి ఉంటుందన్నారు. ప్రియాంక ‘బిగ్‌బాస్‌’ టైటిల్‌ గెలవకపోయినప్పటికీ నిత్యం సమాజంలో అవమానాలు, హేళన ఎదుర్కొనే వారికి స్ఫూర్తిగా నిలిచిందని ప్రశంసించారు. ఈ మేరకు నాగబాబు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పోస్టు పెట్టారు. ప్రియాంతో దిగిన ఫొటోను షేర్ చేసి పై విధంగా రాసి ఇన్ స్టాలో పోస్టు పెట్టారు మెగా బ్రదర్ నాగేంద్రబాబు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp