Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ ఫైర్.. విశ్వపై యానీ మాస్టర్ సీరియస్.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరో? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య నామినేషన్ ఫైర్.. విశ్వపై యానీ మాస్టర్ సీరియస్.. ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరో?

 Authored By mallesh | The Telugu News | Updated on :11 October 2021,3:30 pm

Bigg Boss 5 Telugu : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ 19 మంది కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేయగా, ఇప్పటికే హౌజ్ నుంచి నలుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక హౌజ్‌లో 15 మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలి ఉన్నారు. హౌజ్ నుంచి ఫస్ట్ వీక్‌లోనే యూట్యూబర్ సరయు , సెకండ్ వీక్‌లో ఉమాదేవి, మూడో వారంలో లహరి, నాల్గో వారంలో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు. ఈ క్రమంలో ఐదో వారంలో ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది.

Bigg Boss 5 Telugu Vishwa vs hany master

Bigg Boss 5 Telugu Vishwa vs hany master

‘బిగ్ బాస్’ హౌజ్‌లో కంటెస్టెంట్స్ మధ్య గొడవలు తారాస్థాయికి చేరడాన్ని చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్స్ ఒకరిపైన మరొకరు విమర్శలు చేసుకోవడం చూసి ఎవరిది తప్పు.. ఎవరిది కరెక్ట్.. అనే విషయాలపై చర్చించుకుంటున్నారు. ఈ సంగతులు పక్కనబెడితే.. హౌజ్‌లో ఐదో వారానికి సంబంధించి ఎలిమినేషన్ నామినేషన్స్ ప్రక్రియకు సంబంధించిన ప్రోమోను స్టార్ మా వారు ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు. సోమవారం రాత్రి పది గంటలకు ఇందుకు సంబంధించిన ఎపిసోడ్ స్టార్ మాలో టెలికాస్ట్ కానుంది.

Bigg Boss 5 Telugu : ఈ సారి హమీదా ఔట్..?

Bigg Boss 5 Telugu Vishwa vs hany master

Bigg Boss 5 Telugu Vishwa vs hany master

ఇకపోతే సదరు ప్రోమోలో కంటెస్టెంట్స్ ఎవరినైతే ఎలిమినేట్ చేయాలనుకుంటారో వారి ఫొటోలను మంటల్లో వేస్తున్నారు. యానీ మాస్టర్ కంటెస్టెంట్ విశ్వపైన ఫైర్ అయింది. దొంగ ఆట వద్దు అంటూ.. అక్క. తొక్క అంటూ రిలేషన్ షిప్ వద్దని, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా ఉండాలని చెప్పింది యానీ. మంటల్లో కంటెస్టెంట్స్ ఫొటోలు వేసే మందర కొన్ని ఆర్గుమెంట్స్ చేస్తూ అలా చేయడాన్ని చూస్తుంటే ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరో అనేది తెలుసుకునేందుకుగాను ప్రేక్షకులకు ఇంకా ఆసక్తి పెరుగుతోంది. ఈ సారి హమీదా హౌజ్ నుంచి బయటకు వెళ్తుందనే వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది