Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ టీమ్ ఫిక్స్ అయిందా.. సన్నినే విన్నర్ చేయనుందా.. లీకైన న్యూస్..?
Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ సీజన్ 5 చివరి వారానికి వచ్చేసింది. ఈ వారంలో ఎవరు బిగ్ బాస్ 5 విన్నరో తేలిపోతుంది. ప్రస్తుతం బిగ్ బాస్ ఫైనల్ లిస్ట్ లో సన్నీ , మానస్ , శ్రీరామ చంద్ర , షన్ను , సిరి లు ఉండగా.. ఓటింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. అఫిషియల్ ఓటింగ్ ఎక్కడా లీక్ కాలేదు కానీ.. బయటి అన్ అఫిషియల్ సైట్లలో మాత్రం సన్నీ టాప్ లో ఉండగా షన్ను రెండో ప్లేస్ లో శ్రీరామ చంద్ర మూడో ప్లేస్ లో మానస్ నాల్గో స్థానంలో ఉండగా..సిరి చివరి స్థానంలో ఉంది. అలా జనాలు సన్నీకి ఓట్లు గుద్ది పడేస్తున్నారు. ఇటీవల స్టేజి పైనుంచి మాట్లాడిన సన్నీ ఫ్రెండ్ స్టేట్మెంట్ ‘కప్పు ముఖ్యం బిగులూ’ ను బట్టి సన్నీ గట్టిగానే ఫిక్స్ అయినట్టు ఉన్నటున్నాడు. గత రాత్రి ప్రసారమైన ఎపిసోడ్‌లో కప్పు కొడుతున్నా..
కళావతి అంటూ ట్రోఫీని గిఫ్ట్‌గా ఇస్తా అమ్మకి అంటూ వాగ్దానం చేశాడు.ఇదిలా ఉండగా.. గత రాత్రి ఏపిసొడ్ లో బిగ్ బాస్ టీమ్.. సన్నీని ఆకాశానికి ఎత్తేసింది. షన్ను జర్నీని కావాలనే తక్కువ చేసి చూపి… సన్నీకి వాంటెడ్ గా హైప్ తీసుకొచ్చే ప్రయత్నాలు చేసింది. అనంతరం బిగ్ బాస్ సన్నీ జర్నీని ప్లే చేశాడు. సన్నీకి గిల్టీ బోర్డ్ వేసి అత్యంత అవమాన కరంగా అవమానించిన వీడియోతో మొదలుపెట్టి హీరో రేంజ్ కి ఎదిగి పోయాడన్న రీతిలో తన జర్నీని ఎడిట్ చేయించాడు బిగ్ బాస్. ఇంట్లో మీ బంధాలు.. గెలిచిన ఆటలు.. జరిగిన గొడవలు.. మోసిన నిందలు.. చేసిన వినోదం.. ఎన్ని ఒడుదుడుగులు వచ్చినా అందరి మొహంపై నవ్వు తీసుకుని వచ్చి ఎంటర్ టైనర్‌గా అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నారంటూనే మీ వాళ్ల కోసం మీరు నిలబడే తీరు అమోఘం అంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.
Bigg Boss 5 Telugu : సన్నీనే బిగ్ బాస్ విన్నరా..!
పోరాడే పట్టుదల.. ఓర్పు మిమ్మల్ని ఇక్కడి వరకూ తీసుకుని వచ్చిందన్నారు. అన్ని ఏమోషన్స్ ను మిక్స్ చేసి.. శ్రీమంతుడు, లెజెండ్ సినిమాల్లోని పాటలతో… అప్నా టైం ఆయేగా అంటూ భారీ హైప్ ఇచ్చారు.హౌస్ లోకి టాప్ సెలబ్రిటీస్ హోదాలో ఎంట్రీ ఇచ్చిన యాంకర్ రవి, యూ ట్యూబర్ షన్ను ని బిగ్ బాస్ కావాలనే తక్కువ చేసి చూపి.. సన్నీని పైకి లేపారనే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. అయితే బిగ్ బాస్ ప్రస్తుత పరిణామాలు కూడా అందుకు అనుగుణంగా కనిపిస్తున్నాయి. గత రాత్రి జరిగిన ఏపిసొడ్ ఒక్కటి చాలు బిగ్ బాస్ టీమ్ కూడా ఈసారి సన్నినే విజేతగా నిలపాలని భావిస్తున్నట్లు ఎవరికైనా తెలిసిపోతుంది. మరి అందరూ అనుకున్నట్టుగానే సన్నినే గెలుస్తాడా.. లేక శ్రీరామో, షన్నునో విన్ అవుతారా వేచి చూడాలి.