Bigg Boss 5 Winner VJ Sunny : చేయని తప్పులకు నిందలు పడ్డాను.. ‘బిగ్ బాస్’జర్నీపై విన్నర్ వీజే సన్నీ కామెంట్స్..
Bigg Boss 5 Winner VJ Sunny : తెలుగు పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ సీజన్ ఫైవ్’ విజేతగా ఖమ్మం కుర్రాడు వీజే సన్నీ నిలిచాడు. గత సీజన్స్‌తో పోల్చితే ఫిఫ్త్ సీజన్ చాలా డిఫరెంట్‌గా జరిగిందని ఈ సందర్భంగా ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే సీజన్ ఫైవ్ ఫినాలే ఈవెంట్ ఈ సారి చాలా గ్రాండ్‌గా జరిగింది. ఎవరూ ఊహించని విధంగా ఈ సారి చాలా మంది సెలబ్రిటీలు ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సంగతులు అలా ఉంచితే.. టైటిల్ విన్నర్ అయిన తర్వాత వీజే సీన్నీ తాజా ఇంటర్వ్యూలో బిగ్ బాస్ జర్నీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అవేంటంటే…
అరియానా గ్లోరితో ‘బిగ్ బాస్ బజ్’ ఇంటర్వ్యూలో సన్నీ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కంటెస్టెంట్స్ గురించి, బిగ్ బాస్ జర్నీ గురించి వివరించాడు. బిగ్‌బాస్ అనేది కంప్లీట్‌గా వేరే ప్రపంచమని చెప్పాడు. ఇకపోతే తాను బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నపుడు చేయని తప్పుకు రెండు మూడు సార్లు నిందలు పడ్డానని తెలిపాడు సన్నీ.బేటన్ టాస్కులో చాలా కష్టప్డానని, అయితే, ఆ టాస్కులో హౌజ్‌మేట్స్ తనను వరస్ట్ పర్ఫార్మర్‌గా ఎన్నుకున్నారని, అందుకు తాను చాలా బాధపడ్డానని వివరించాడు సన్నీ.

bigg boss 5 winner vj sunny comments on his journey
Bigg Boss 5 Winner VJ Sunny : ‘బిగ్ బాస్’ వేరే ప్రపంచమన్న సన్నీ..
ఇక కెప్టెన్సీ కోసం పోటీ ఉన్నపుడు తనను హౌజ్ మేట్స్ పొడిచేశారని, అప్పుడు కూడా తాను చాలా బాధపడ్డానని చెప్పుకొచ్చాడు సన్నీ. శ్రీరామ్ నామినేషన్స్ విషయంలో ఒకలా ఉంటారని, నార్మల్ టైంలో మరొకలా ఉంటారని చెప్పాడు. ఇక నటరాజ్ మాస్టర్ లయన్ అని పేర్కొన్నాడు. ఇక ట్రాన్స్ ఉమన్ పింకీ అలియాస్ ప్రియాంక సింగ్ లాంటి అమ్మాయి దొరకాలంటే ఎవరికైనా రాసి పెట్టి ఉండాలని అన్నాడు. ఇక కాజల్ తనకు మొదట్లో నచ్చేది కాదని కానీ, ఆ తర్వాత టైంలో చాలా మంచి ఫ్రెండ్ అయ్యిందని తెలిపాడు. ఇక షణ్ముక్ జస్వంత్, సిరి హన్మంత్ ఫ్రెండ్ షిప్ చాలా బాగుంటుందని, వారిద్దరూ ఒకరిపై మరొకరు కేర్ తీసుకునే వారని పేర్కొన్నాడు.
