Bigg Boss 6 Telugu : ఈ వారం ఎలిమినేషన్ లిస్ట్.. ఆమెకు మూడిందా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: September 13, 2022, 6:30 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. ఈ సీజన్ గత సీజన్లన్నింటికంటే కాస్త భిన్నంగా సాగుతోంది. ప్రతీ సీజన్‌లో మొదటి వారం నామినేషన్ ఎలిమినేషన్స్ కచ్చితంగా జరిగేవి. కానీ ఈ సీజన్‌లో మాత్రం మొదటి వారం నో ఎలిమినేషన్ అని పెట్టారు. ఇంకా కంటెస్టెంట్లు సదురుకోలేదని వింత కారణం చెప్పి నో ఎలిమినేషన్ అని ప్రకటించాడు నాగ్. ఆ కారణం ఎంత వరకు కరెక్ట్ అన్నది బిగ్ బాస్ టీంకే తెలియాలి. ఇక ఈ రెండో వారం నామినేషన్స్‌లోనూ కాస్త వెరైటీ పద్దతిని ఫాలో అయ్యారు.మామూలుగా అయితే ప్రతీ సారి ఒక్కో కంటెస్టెంట్‌కు ఇద్దరినీ నామినేట్ చేసే అవకాశాన్ని ఇచ్చేవాడు.

కానీ ఇంట్లొ 20 మంది ఉండటంతో ఒక్కొక్కరికి ఒక్కరిని మాత్రమే నామినేట్ చేసే అధికారం ఇచ్చాడు. చివరకు ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్.. కెప్టెన్ అయిన బాలాదిత్యకు ఇద్దరిని నామినేట్ చేసే అవకాశం ఇచ్చాడు. అయితే ఈ నామినేషన్ ప్రాసెస్‌లో సిల్లీ సిల్లీ కారణాలు వినిపించాయి. జంటగా వచ్చారని మెరినా రోహిత్‌ను నామినేట్ చేశాడు ఆదిరెడ్డి.దీంతో ఆది రెడ్డికి హైట్ అనే అడ్వంటేజ్ ఉందని ఇనయ అతడిని నామినేట్ చేసింది. ఇలా పిచ్చి పిచ్చి కారణాలతో నామినేషన్ ప్రక్రియ సాగింది. ఒక్క ఓటు పడ్డ కంటెస్టెంట్లు కూడా నామినేషన్లోకి వచ్చేశారు. ఫైమాకు ఒక్క ఓటే పడింది. కానీ నామినేషన్లోకి వచ్చేసింది. ఆమెను వాసంతి నామినేట్ చేసింది.

Bigg Boss 6 Telugu 2nd week nomination list and geethu in danger zone

Bigg Boss 6 Telugu 2nd week nomination list and geethu in danger zone

తనతో సరిగ్గా మాట్లాడటం లేదని,చూసి నవ్వడం లేదని నామినేట్ చేసింది. ఆ కారణంతో ఫైమా బాధపడింది. అయితే మొత్తానికి ఈ వారం మాత్రం అభినయ, షానీ, రాజ్, రేవంత్, గీతూ, మెరినా రోహిత్ వంటివారు నామినేషన్లోకి వచ్చారు. ఈ సారి ఎవరికి మూడుతుందో చూడాలి. అయితే అభినయ మొదటి వారంలోనే నామినేట్ కావాల్సింది. మరి ఈ వారం కూడా ఆమెనే జనాలు ఇంటికి పంపించేస్తారా? అన్నది చూడాలి. కానీ ప్రస్తుతం గలాట గీతూకు విపరీతమైన నెగెటివిటీ ఏర్పడింది. ఆమెను ఎలిమినేట్ చేసేద్దామనే కసి మీద ఆడియెన్స్ ఉన్నారని అనిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp