Sukumar : ఆ హీరోతో లిప్‌కిస్ పెట్టించాలని సుకుమార్‌ను కోరిన స్టార్ హీరోయిన్.. ఏం చేశాడంటే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Sukumar : ఆ హీరోతో లిప్‌కిస్ పెట్టించాలని సుకుమార్‌ను కోరిన స్టార్ హీరోయిన్.. ఏం చేశాడంటే?

 Authored By mallesh | The Telugu News | Updated on :13 September 2022,5:30 pm

Sukumar : దర్శకుడు సుకుమార్ తన సినిమాల్లో తప్పకుండా ఏదో ఒక సీన్‌లో రొమాన్స్ ఉండేలా చూసుకుంటాడు. తన ప్రతి సినిమాలోనూ ఇదే కంటిన్యూ చేస్తూ వస్తున్నాడు. ఆర్య-2,రంగస్థలం, పుష్ప పార్ట్-1లో హీరోయిన్లతో హీరోలకు లిప్ కిస్ పెట్టిస్తూ వస్తున్నాడు. ఆర్య-2లో మాత్రం కాస్త రివర్స్ ప్లాన్ చేశాడు.అయితే, సుకుమార్ ఎన్నడూ లేని విధంగా ఒక వింత అనుభవాన్ని ఎదుర్కొన్నాడట.. అదేంటంటే ఒక హీరోయిన్ అతని వద్దకు వచ్చి అల్లు అర్జున్‌తో లిప్ కిస్ సీన్ పెట్టించాలని కోరిందట.. ప్రస్తుత రోజుల్లో విడుదలయ్యే ప్రతి సినిమాలోనూ రొమాంటిక్ సన్నివేశాలు ఉంటున్నాయి.

ఎందుకంటే అవి లేకపోతే ప్రేక్షకులు తమ సినిమా చూడరని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట.. ఈ నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన బడా, చోటా అనే తేడా లేకుండా అన్నింటిలోనూ ముద్దు సీన్లు కామన్ అయిపోతున్నాయి. ఫ్యామిలీ సినిమాలు తీసే దర్శకులు కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారంటే అతిశయోక్తి కాదు. దర్శకుడు సుకుమార్ విషయానికొస్తే ఆయన తన సినిమాల్లో తప్పకుండా వైవిధ్యం చూపిస్తాడు. ఇటీవల వచ్చిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప పార్ట్-1లో రష్మికతో బన్నీకి లిప్ కిస్ పెట్టించాడు దర్శకుడు.

The star heroine asked Sukumar to ks the hero

The star heroine asked Sukumar to ks the hero

sukumar : సుకుమార్‌కే షాకిచ్చిన హీరోయిన్

అదేవిధంగా తన రొమాంటిక్, లవ్ బేస్డ్ మూవీ ఆర్య-2లో బన్నీ లిఫ్టులో వెళ్తున్న టైంలో కాజల్‌కు లిప్ కిస్ పెడతాడు. అప్పట్లో ఈ సీన్ సినిమాకు హైలెట్ అయ్యింది. ఇక ఆర్య -2 షూటింగ్ టైంలో కాజల్‌కు ముద్దు ఇచ్చాక అల్లు అర్జున్ అమాయకుడిలా అందరి ముందు యాక్టింగ్ చేస్తాడు. ఇక మరో హీరోయిన్ శ్రద్ధాదాస్ మాత్రం నేరుగా దర్శకుడి దగ్గరకు వెళ్లి బన్నీతో తనకు లిప్ కిస్ సీన్ పెట్టాలని కోరిందట.. ఆ మాట విన్న సుకుమార్ షాక్ అయ్యాడట.. వాస్తవానికి లిప్, బెడ్ సీన్స్ చేయడానికి హీరోయన్ నో చెబుతుంటారు. కానీ శ్రద్ధాదాస్ ఏకంగా బన్నీతో లిప్ కిస్ గురించి మాట్లాడటంతో సుకుమార్ నవ్వుకున్నాడట.. వెంటనే సీన్ కంప్లీట్ చేసి తన వర్కలోకి వెళ్లిపోయాడు.

Advertisement
WhatsApp Group Join Now

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది