Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ లో ఇనయ ఔట్ .. ఆ కారణం గానే ఎలిమినేట్ ?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: December 10, 2022, 7:00 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ తీసుకున్న నిర్ణయానికి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఎలిమినేషన్ గురించి పెద్ద చర్చ జరుగుతోంది. ప్రస్తుతం బిగ్బాస్ లో ఇనయ ఎలిమినేట్ కాబోతుందని వార్తలు వస్తున్నాయి. అందరూ ఇనయ బిగ్ బాస్ 6 విన్నర్ లేదా రన్నర్ అవుతుందని అనుకున్నారు. అలాంటిది ఇప్పుడు ఆమె బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కాబోతుందని సమాచారం. అసలు ఈమెను హౌస్ నుంచి పంపించడానికి గల కారణాలు ఏంటి అని అందరు ఆలోచిస్తున్నారు. ఈవారం నామినేషన్ లో రేవంత్ రోహిత్, ఆదిరెడ్డి, శ్రీసత్య, కీర్తి, ఇనయా లు ఉన్నారు.శ్రీహాన్ కు టికెట్ టు ఫినాలే రావడంతో అతడికి నామినేషన్స్ నుంచి మినహాయింపు దొరికింది.

అలాగే ఫైనల్ లో నిలిచిన మొదటి కంటెస్టెంట్ గా శ్రీహాన్ నిలిచాడు. అలాగే ఈ సీజన్ స్టార్ట్ అయిన దగ్గర్నుంచి ఒంటరిగా పోరాడుతూ వచ్చింది ఇనయ, హౌస్ లో ప్రతి ఒక్కరికి గట్టి పోటీ ఇచ్చింది. ఇక ఈవారం కూడా ఓటింగ్ లో ఏ పోల్ చూసుకున్న సరే టాప్ 3 లో ఉంది. అయితే బిగ్బాస్ మాత్రం ఇనయని ఎలిమినేట్ చేస్తారు అనే వార్తలు వస్తున్నాయి. పోల్ లెక్కల ప్రకారం చూస్తే తొలి రెండు ప్లేసుల్లో రేవంత్, రోహిత్ ఉన్నారు. మూడో ప్లేసులో ఇనయ ఉంది. ఆ తర్వాత ఆదిరెడ్డి, శ్రీ సత్య, కీర్తి వరుసగా ఉన్నారు. దీని ప్రకారం చూస్తే కీర్తి ఎలిమినేట్ కావాల్సి ఉంది.

Bigg Boss 6 Telugu eliminated Inaya sultana

Bigg Boss 6 Telugu eliminated Inaya sultana

కానీ హౌస్ నుంచి ఆమె కాకుండా ఇనయ వెళ్తుందని టాక్ వస్తుంది. తొలి రెండు వారాలు కాస్త డల్ గా కనిపించిన ఇనయ, ఆ తర్వాత నుంచి ప్రతి టాస్క్ లో బాగా ఆడింది. కొన్నిసార్లు రేవంత్ ను పక్కకినెట్టి ఓటింగ్ విషయంలో కొన్ని వారాలు టాప్ లో నిలిచింది. మిగతా కంటెస్టెంట్స్ గేమ్స్ బాగా ఆడకపోయినా ఓనయ మాత్రం దూకుడుగా గేమ్స్ ఆడింది. అలాంటిది ఇప్పుడు బిగ్బాస్ ఆమెనే ఎలిమినేట్ చేస్తున్నాడు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. ప్రేక్షకుల మాత్రం ఇనయ ఫైనల్ కి చేరుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ఎలిమినేషన్ నిజమో కాదో తెలియాలంటే ఈ వీకెండ్ అయిపోయే వరకు వేచి చూడాలి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp