Bigg Boss Revanth : బుద్ధి ఉందా రేవంత్.. బయట మీ ఆవిడ కడుపుతో ఉంది అని తెలీదా?
Bigg boss Revanth : బిగ్ బాస్ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. క్షణక్షణం అక్కడ పరిస్థితులు మారిపోతుంటాయి. మొదటి వారం ఉన్న పరిస్థితులు తర్వాత ఉండవు. తర్వాత ఉన్నవి.. మొదటి వారం ఉండవు. చివరి వరకు ఎవరు ఉంటారు.. ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పడం చాలా కష్టం. అసలు.. గెలుస్తారు అనుకునే వాళ్లు వెంటనే ఎలిమినేట్ అవుతుంటారు. ఎలిమినేట్ అవుతారు అని అనుకునే వాళ్లు టాప్ 5 లో మిగులుతారు. ఫైనలిస్టులు అవుతారు. ప్రస్తుతం రేవంత్.. వాసంతికి దగ్గరవుతున్నాడు. ఎందుకంటే..
గీతూ మాటలను బట్టి అదే తెలుస్తోంది. వాసంతిని రేవంత్ ఇష్టపడుతున్నాడని గీతూ చెప్పింది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే.. రేవంత్ కు పెళ్లయింది. తన భార్య ప్రస్తుతం కడుపుతో ఉంది. ఇలాంటి పరిస్థితిలో వాసంతిని రేవంత్ ఇష్టపడటం ఏంటి అని అంతా అనుకుంటున్నారు. ఆదివారం ఎపిసోడ్ తో లాలిపాప్ విషయంలో నాగార్జున ఒక సీక్రెట్ చెబితే ఆ లాలిపాప్ ను తీసుకోవచ్చు అని చెబుతాడు నాగార్జున. దీంతో రేవంత్.. వాసంతి పట్ల సాఫ్ట్ గా ఉన్నాడు అని చెబుతుంది గీతూ. తను అంటే రేవంత్ కు ఇష్టం అని చెప్పింది. అయితే.. పెళ్లి అయిన రేవంత్ కు ఎఫైర్ ను అంటగట్టడం ఏంటంటూ కొందరు విమర్శిస్తున్నారు.

bigg boss 6 telugu revanth and vasanthi love story
Bigg Boss Revanth : అందరి ముందే సీక్రెట్ రివీల్ చేసిన గీతూ
నిజానికి వాసంతి సింగిలే. తను మొదటి నుంచి బిగ్ బాస్ హౌస్ లో గ్లామర్ ను ప్రదర్శిస్తోంది. కేవలం తను గ్లామర్ షోకే పరిమితం అయిందంటూ తనపై విమర్శలు కూడా వచ్చాయి. రేవంత్ భార్య గర్భిణీగా ఉన్న సమయంలో.. ఇలా గీతూ రేవంత్ పై ఆరోపణలు చేయడం ఏంటంటూ బిగ్ బాస్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అసలు నిజంగానే రేవంత్, వాసంతి మధ్య ఏముంది అంటూ ప్రశ్నిస్తున్నారు. నిజానికి.. వాసంతి.. అర్జున్ పట్ల ఇంట్రెస్ట్ ఉంది. మరోవైపు ఇనయా, సూర్య ఒక్కటయ్యారు. మరి.. ఈ రేవంత్, వాసంతి లవ్ స్టోరీ ఎలా పుట్టిందో తెలియదు. చూడాలి మరి.. మున్ముందు ఏం జరుగుతుందో బిగ్ బాస్ హౌస్ లో.