Bigg Boss Revanth : రోజురోజుకి రేవంత్ పిచ్చొడిలా చేస్తున్నాడేంటి.. మైండ్ దొబ్బిందా?
Bigg Boss Revanth : బిగ్ బాస్ నామినేషన్స్ ఎంత రసవత్తరంగా సాగుతుంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నామినేషన్స్ సమయంలో హౌజ్‌మేట్స్ పిచ్చెక్కినట్టు ప్రవర్తిస్తుంటారు. గత ఆరువారాలుగా బిగ్ బాస్ నామినేషన్స్ హీట్ పెంచుతుండగా.. ఏడోవారం నామినేషన్స్‌లో అంతా బురద బురదే. బిగ్ బాస్ దత్తపుత్రిక గీతుతోనే ఎపిసోడ్ స్టార్ట్ చేశారు.. పెద్ద మనుషులు ఆదిత్య, ఆదిరెడ్డిలతో గీతు రోత మొదలైంది. సుదీప వెళ్లిపోతే నువ్ సెట్ అయిపోతావ్ అని గీతు అన్న మాటల్ని గుర్తు చేసిన ఆదిత్య.. ఈరకంగానే నైనా నువ్వు దగ్గర అవుదాం అనుకుంటున్నా.. ఎంత ప్రేమలేకపోతే నా పెళ్లంతో మాట్లాడితే నీ గురించి చెప్తా.. నువ్వు మాట్లాడాలి అనుకుంటే మాట్లాడు..
లేదంటే లేదు.. నీ ఇష్టం’ అని చెప్పాడు రేలంగి మావయ్య. హౌస్ చార్జింగ్ కోసం రెండు వారాలు నామినేట్ అయిన రోహిత్ కోసం ఆలోచించి కెప్టెన్ కావాలని తన బాల్ ఇచ్చేసి తప్పుకున్న బాలాదిత్యను ఇంటి సభ్యులంతా అత్యధికంగా నామినేట్ చేశారు.కెప్టెన్ అయ్యిండి రెండు కునికిపాట్లు తీసినందుకు ఫాపం రేవంత్ ను ఇంటి సభ్యులంతా నామినేట్ చేసి పడేశారు, అయితే బిగ్ బాస్ ఈ వారం నామినేట్ అయిన వారితో బురద స్నానం చేసి వారందరికీ జ్ఞానోదయం చేశాడు. ఎక్కువ సార్లు బురదలో మునిగిన రేవంత్ కు కాస్తా మైండ్ దొబ్బినట్టై పుష్పలా ప్రవర్తించాడు. బాలాదిత్య ఎక్కువ సార్లు బురదలో కడిగి కాస్త కఠినంగా మారిపోయాడు.
Bigg Boss Revanth : వామ్మో పిచ్చెక్కించే పర్‌ఫార్మెన్స్..
మరోవైపు సూర్య, ఇనయలను స్క్రీన్‌పై చూస్తుంటేనే ఛీ అనేట్టుగా మారింది. మన కాట్రాజ్ సూర్య అయితే ఇనయ గేమ్‌ని మారుస్తా అంటూ బిగ్ బాస్ కెమెరాల ముందు కమల్ హాసన్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ‘నా వల్ల ఇనయ గేమ్ డిస్ట్రబ్ కావడం ఇష్టం లేదు బిగ్ బాస్.. నా వల్ల తను డిస్ట్రబ్ అయ్యిందేమో తెలియదు కానీ.. నాకు ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం వల్ల తన గేమ్ డెడ్ అవ్వడం నచ్చలేదు బిగ్ బాస్.. వ్యక్తిగతంగా ఇనయ అంటే నాకు ఇష్టం బిగ్ బాస్.. ఎందుకంటే ఇండిపెండెంట్ ఉమెన్ అంటే ఇష్టం.. రెస్పెక్ట్ చేస్తా.. మా అమ్మని గానీ బుజ్జమ్మని గాని గట్టిగా పట్టుకుని ఏడ్వాలని ఉంది బిగ్ బాస్’ అని కెమెరాలు చూస్తూ పెర్ఫామెన్స్ ఇచ్చాడు