Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ హౌస్ లో తన భర్త చేసేవి చూసి రగిలిపోతోన్న రేవంత్ భార్య !
Bigg Boss 6 Telugu : బుల్లితెర ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బాగ్ బాస్ సీజన్ 6 కోసం మొత్తం 21 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లో అడుగుపెట్టారు. కొంత మంది ఏదో టైం పాస్‌కి హౌజ్‌లో అడుగు పెట్టినట్టు చేస్తున్నారు. దీంతో అలాంటి కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతున్నారు. చివరిగా చలాకీ చంటి ఎలిమినేట్ అయ్యారు. ఇక రేవంత్ వ్యవహారం హౌజ్‌లో కొంత తేడా ఉన్నా కూడా ఏదో నెట్టకొస్తున్నాడు.. ‘ఆడ పిల్లకాయలతో ఫ్రీ మోడ్‌లో వెళ్లిపోతున్నావ్.. వాళ్లు కంఫర్టబుల్‌నా కాదో చూస్కో అని అన్నది. ఏ విషయంలో అంటున్నావో క్లారిటీగా చెప్పు అని రేవంత్ అనడంతో..
‘నువ్ నాకు బుగ్గపై ముద్దు పెట్టావ్ కదా.. నేను కంఫర్టబుల్‌గా ఫీల్ కాలేదు అని అన్నది. నీ ఉద్దేశం అది కాదని నాకు తెలుసు.. నువ్ ఎంత ఫ్రీగా ఉన్నావో కానీ కంఫర్ట్ కూడా చూసుకోవాలి అన్నది. దీంతో రేవంత్.. ఛీ ఛీ నాకు ఆ ఉద్దేశమే లేదు అన్నాడు.. నువ్వు ఫైమా మీద కూడా పడుకున్నావ్. ఆమె కంఫర్టబుల్‌నా కాదో కూడా నీకు తెలియదు. వాళ్లని ఒకసారి అడుగు.. కంఫర్ట్‌నా కాదా? అని లేదంటే వాళ్లు ఫీల్ అవుతారు.. చూసేవాళ్లు ఏం అనుకుంటారో తెలియదు కదా? ఇది వేరేలా వెళ్లదు బట్.. నీకు జాగ్రత్త చెప్తున్నా.. మీ ఆవిడ కూడా ఏం అనుకోకూడదు కదా’ అని రేవంత్‌కి హితబోధ చేసింది గీతు. ఇక రేవంత్ ఫైమాకి సారీ చెబుతుంటే తాను ఏమి అలా ఫీల్ కాలేదు, నువ్వు కూడా కాకు అంటూ వెళ్లిపోయింది ఫైమా.

Bigg Boss 6 Telugu revanth wife fire on her husband
Bigg Boss 6 Telugu : రగిలిపోతుంది..
రేవంత్ హౌస్‌లో ఉన్న వాళ్లలో స్ట్రాంగ్ అని ఆమెకు తెలుసు.. అందుకే గీతే కొన్ని విషయాలనె తెలియజేస్తూ రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది. ఫైమాపై పడుకున్నాడంటే.. అది జనంలోకి నిజంగానే నెగిటివ్‌గా వెళ్లొచ్చు. నిజానికి ఫైమాపై పడుకున్నది టెలికాస్ట్ కాలేదు కాని గీతూ మాత్రం రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ చేసేందుకు ఎంతగానో ప్రయత్నిస్తుందనే చెప్పాలి. అయితే రేవంత్ హౌజ్‌లో చేసే పనులకి ఆమె భార్య తెగ ఫైర్ అవుతున్నట్టు తెలుస్తుంది. కాగా, బిగ్ బాస్ 6’ లో రేవంత్ కంటెస్టెంట్లకు కొంచెం టఫ్ గా కనిపిస్తున్నప్పటికీ చాలా జెన్యూన్ గా ఆడుతున్నాడు అనే ఫీలింగ్ అయితే ప్రేక్షకుల్లో కలిగింది. మొదటి వారం ఇతని జర్నీ ఎమోషనల్ గా సాగింది. రేవంత్ 2022 ఫిబ్రవరి లో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.