Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజ‌న్ 6లో కాస్ట్‌లీ కంటెస్టెంట్ ఈమెనే!

Authored By Sam C | The Telugu News | Published on: August 11, 2022, 4:40 pm

Bigg Boss 6 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ హంగామా మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానుంది. సెప్టెంబ‌ర్ 4 నుండి ఈ షో మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇప్ప‌టికే ప్రోమోల‌తో సంద‌డి చేస్తున్నారు. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. ఇక్కడి ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. ఫలితంగా భారీ టీఆర్పీ రేటింగ్‌తో దేశంలోనే టాప్ ప్లేస్‌కు చేరుకుంది. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్లను పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి అప్పుడే చర్చ కూడా మొదలైంది. ఈ సీజన్ లో అందాల యాంకర్ ఉదయ భాను కంటెస్టెంట్ గా పాల్గొననున్నారని తెలుస్తోంది.

Bigg Boss 6 Telugu : కాస్ట్‌లీ కంటెస్టెంట్..

ఒక‌ప్పుడు తన మాటలతో, చలాకీ తనంతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఉర్రుతలూగించారు ఉదయభాను. ఆ తర్వాత ఆమె యాంకరింగ్ కు దూరం అయ్యారు. బిగ్ బాస్ సీజన్ 6 కు ఈ అమ్మడిని సంపాదించారని తాజా వార్త. ఇందుకోసం ఉదయభానుకు భారీ రెమ్యునరేషన్ ను కూడా ఆఫర్ చేశారట. బిగ్‌బాస్ 6వ సీజ‌న్లోనే హ‌య్య‌స్ట్ ఫెయిడ్ కంటెస్టెంట్‌గా ఉద‌యభాను ఎంపికైంద‌ని అంటున్నారు. ఆమె రెమ్యున‌రేష‌న్‌గా రోజుకు ల‌క్ష‌ల్లోనే నిర్వాహ‌కులు ఫిక్స్ చేశార‌ట‌. ఇది బిగ్ చ‌రిత్ర‌లోనే హ‌య్య‌స్ట్ అంటున్నారు. ఇందులో నిజం ఎంత ఉంద‌నేది తెలియాల్సి ఉంది.

Bigg Boss 6 Telugu She Is The Costly Contestant

Bigg Boss 6 Telugu She Is The Costly Contestant

భారీ అంచనాల నడుమ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కోసం నిర్వహకులు పనులను దాదాపుగా పూర్తి చేశారని తెలిసింది. ఇందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్‌ పనులు ఇప్పటికే పూర్తి చేశారని సమాచారం. దీన్ని గతంలో కంటే కలర్‌ఫుల్‌గా ఏర్పాటు చేశారట. ఇక, ఈ సీజన్‌లో సరికొత్త కాన్సెప్టును పరిచయం చేస్తున్నారని, టాస్కులు కొత్తగా ఉంటాయని టాక్. ఆరో సీజన్‌లో న్యూస్ యాంకర్ ప్రత్యూష కూడా భాగం అవుతుందని తెలిసింది. ఆమె ప్రస్తుతం ఓ టాప్ న్యూస్‌ ఛానెల్‌లో పని చేస్తున్న విషయం తెలిసిందే.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp