Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 లో స్టార్ యాంకర్ ఎంట్రీ… మిగతా కంటెస్టెంట్లు వీరేనా…

Authored By aruna | The Telugu News | Updated on : 6 August 2022, 2:20 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ షో బుల్లితెరపై ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. బిగ్ బాస్ కి ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటి సీజన్ దాకా దానికి ఏమాత్రం క్రేజ్ తగ్గడం లేదు. బిగ్ బాస్ ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుందో అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 6 వచ్చే నెల నుంచి మొదలు కానుంది. స్టార్ మా ఛానల్లో ప్రసారం కానుండగా ఈ షోకి నాగార్జున హోస్ట్ గా చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్ల సెలక్షన్ ప్రాసెస్ కంప్లీట్ అయిందని తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 6 లో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న లిస్టులో ఉన్న కంటెస్టెంట్లు బిగ్ బాస్ లో ఉంటారో లేదో ఖచ్చితంగా చెప్పలేం…

జబర్దస్త్ కొత్త యాంకర్ మంజుష అని గత కొద్దికాలంగా ప్రచారం జరగగా రష్మినే జబర్దస్త్ కు కూడా యాంకర్ గా కొనసాగుతుందని నిన్నటి ఎపిసోడ్ లో తెలిసిపోయింది. అయితే యాంకర్ మంజుషా బిగ్ బాస్ షోలో కనిపించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతుంది. అలాగే తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న ఆశ షైనీ కూడా బిగ్ బాస్ 6 కంటెస్టెంట్లలో ఉన్నారని టాక్ వస్తుంది. అంతేకాకుండా హీరోయిన్ ప్రీతి అస్రాని కూడా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లలో ఒకరని జోరుగా వార్తలు నడుస్తున్నాయి.

Bigg Boss 6 Telugu Star Anchor Coming As Contestant

Bigg Boss 6 Telugu Star Anchor Coming As Contestant

ఈ మధ్యకాలంలో సరైన హిట్ లేక కెరీర్ విషయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న హీరోలలో సుమంత్ అశ్విన్ ఒకరు. సుమన్ అశ్విన్ కూడా బిగ్ బాస్ 6 లో సందడి చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. అలాగే సీరియల్ యాక్టర్ కౌశిక్, మాస్టర్ భరత్ పేర్లు కూడా జోరుగా వినిపిస్తున్నాయి. యూట్యూబ్ ద్వారా పాపులర్ అయిన కృషిత, ప్రముఖ ఆర్టిస్ట్ సంజనా చౌదరి, న్యూస్ యాంకర్ పద్మిని, ట్రాన్స్ జెండర్ తన్మయి ఉన్నారని తెలుస్తుంది. ప్రేక్షకులకు పరిచయం ఉన్న కంటెస్టెంట్లతో పాటు సామాన్యులకు కూడా బిగ్ బాస్ షోలో ఛాన్స్ దక్కనుందని తెలుస్తుంది. ఈసారి బిగ్ బాస్ షో రికార్డు స్థాయిలో రేటింగ్ ను సొంతం చేసుకుంటుంది అని అభిమానులు భావిస్తున్నారు.

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp