Bigg Boss 6 Telugu : రేవంత్ ని గెలిపించడం కోసం ఇంత నీచానికి దిగిన బిగ్ బాస్.. ఇనయానే కాదు వచ్చే వారం మధ్యలో అతన్ని కూడా.. కల్లో కూడా ఊహించరు ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss 6 Telugu : రేవంత్ ని గెలిపించడం కోసం ఇంత నీచానికి దిగిన బిగ్ బాస్.. ఇనయానే కాదు వచ్చే వారం మధ్యలో అతన్ని కూడా.. కల్లో కూడా ఊహించరు ..!

 Authored By ramesh | The Telugu News | Updated on :11 December 2022,2:30 pm

Bigg Boss 6 Telugu : బిగ్ బాస్ సీజన్ 6 పై ఇప్పటికే ఆడియన్స్ తీవ్ర అసంతృప్తిలో ఉండగా లేటెస్ట్ గా ఇనయా ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ బిగ్ బాస్ ఆడియన్స్ మరింత ఫైర్ అవుతున్నారు. హౌస్ లో ఉన్న శ్రీ సత్య, కీర్తీల కన్నా ఇనయా ఎందులో తక్కువ అని.. అయినా కూడా వారిద్దరి కన్నా ఇనయాకే ఎక్కువ ఓట్స్ వచ్చి ఉంటాయి కానీ ఫైనల్ వీక్ లో ఇనయా ఉంటే రేవంత్ విన్నర్ కాకుండా ఆమె పోటీ వచ్చే ప్రమాదం ఉందని బిగ్ బాస్ టీం ఆమెని కావాలని ఎలిమినేట్ చేశారని ఫ్యాన్స్ అంటున్నారు.

అసలు బిగ్ బాస్ లో అలా జరిగే ఛాన్స్ లేకపోయినా కొన్ని లెక్కలు చూస్తే అది నిజమే అని ఒప్పుకోక తప్పట్లేదు. ముఖ్యంగా బిగ్ బాస్ టీం రేవంత్ ని గెలిపించడం కోసమే ఈ వారం ఇనయాని బయటకు పంపించేశారని చెబుతున్నారు. అంతేకాదు వచ్చే వారం మిడిల్ వీక్ లోనే కామన్ మ్యాన్ ఆది రెడ్డిని కూడా హౌస్ నుంచి బయటకు పంపిస్తారని అంటున్నారు. వెనక ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు కాబట్టే చివరి నిమిషంలో ఇలా వీరిని టాప్ 5 కి వెళ్లకుండా బిగ్ బాస్ టీం ఎలిమినేట్ చేస్తుందని అంటున్నారు.

Bigg Boss 6 Telugu team ready for another elimination for saving revanth

Bigg Boss 6 Telugu team ready for another elimination for saving revanth

అయితే ఇనయా ఎలిమినేషన్ వల్ల బిగ్ బాస్ టీం కి ఫ్యాన్స్ నుంచి షాక్ లు తగులుతున్నాయి. అసలు ఓటింగ్ ప్రకారమే ఎలిమినేషన్స్ జరుగుతున్నాయా లేదా అన్నది డౌట్ పడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న ఆది రెడ్డి టాప్ 5 లో వెల్లకుండా వస్తే మాత్రం బిగ్ బాస్ టీం కి కామన్ మ్యాన్ ఫ్యాన్స్ నుంచి పెద్ద గొడవ జరిగే ఛాన్స్ ఉంది. ఇనయా ఎలిమినేషన్ నే అన్ ఫెయిర్ అన్న వారు ఆది రెడ్డి పక్కా టాప్ 5 అనుకుంటుండగా అతన్ని ఎలిమినేట్ చేస్తే మాత్రం సీన్ వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది