Bigg Boss 8 : బిగ్ బాస్ 8 ఈ సారి ముందే వ‌చ్చేస్తుంది.. పూర్తి డీటైల్స్ ఇవే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss 8 : బిగ్ బాస్ 8 ఈ సారి ముందే వ‌చ్చేస్తుంది.. పూర్తి డీటైల్స్ ఇవే..!

Bigg Boss 8 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం మంచి స‌క్సెస్ అయింది. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా.. ఎన్ని గొడవలు జరిగినా.. బిగ్ బాస్ షో ముందుకు సాగుతూనే ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన గొడవ వల్ల కొత్త సీజ‌న్ ఉంద‌డ‌ద‌ని అంతా భావించారు. కాని బిగ్ బాస్ సీజ‌న్ 8 అనుకున్న స‌మ‌యం కంటే ముందే […]

 Authored By ramu | The Telugu News | Updated on :12 April 2024,5:00 pm

ప్రధానాంశాలు:

  •  Bigg Boss 8 : బిగ్ బాస్ 8 ఈ సారి ముందే వ‌చ్చేస్తుంది.. పూర్తి డీటైల్స్ ఇవే..!

Bigg Boss 8 : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదం పంచుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్య‌క్ర‌మం మంచి స‌క్సెస్ అయింది. ఎన్ని కాంట్రవర్సీలు వచ్చినా.. ఎన్ని గొడవలు జరిగినా.. బిగ్ బాస్ షో ముందుకు సాగుతూనే ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే రోజు జరిగిన గొడవ వల్ల కొత్త సీజ‌న్ ఉంద‌డ‌ద‌ని అంతా భావించారు. కాని బిగ్ బాస్ సీజ‌న్ 8 అనుకున్న స‌మ‌యం కంటే ముందే మొద‌లవుతుంద‌ని తెలుస్తుంది. సీజ‌న్ 7 త‌ర్వాత ఓటీటీ షో ఉంటుంద‌ని అంతా అనుకున్నారు. కాని దానికి బ్రేక్ వేసి బిగ్ బాస్ సీజన్ 8 సన్నాహాలు మొదలు పెట్టారు.. ప్రస్తుతం స్టార్ మా ఛానల్‌లో ‘నీతోనే డాన్స్’ కార్యక్రమం నడుస్తుంది. ఈ షో ముగిసిన వెంటనే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది.

Bigg Boss 8 : త్వ‌ర‌లో బిగ్ బాస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్..

గత సీజన్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కాగా, అందుకు కార‌ణాలు ఉన్నాయి. సీజన్ 6 అట్టర్ ఫ్లాప్ కావడంతో.. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభించడానికి కాస్త స‌మ‌యం తీసుకున్నారు. ఉల్టా పుల్టా అంటూ కొత్త‌గా ఈ షోని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు వ‌చ్చి ర‌క్తి క‌ట్టించారు. ఇక సీజన్ 7 సూపర్ సక్సెస్ కావడంతో.. సీజన్ 8ని కాస్త ముందుగానే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులు చ‌క‌చ‌క జరుగుతున్నాయని టాక్ వస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే అతి తొందర్లో ఈ సీజన్‌కు సంబంధించిన అనౌన్స్‌మెంట్ కూడా బయటికి వస్తుంది. ఈ సారి 20 మందిని హౌజ్‌లోకి పంపిస్తారనే టాక్ కూడా న‌డుస్తుంది.

Bigg Boss 8 బిగ్ బాస్ 8 ఈ సారి ముందే వ‌చ్చేస్తుంది పూర్తి డీటైల్స్ ఇవే

Bigg Boss 8 : బిగ్ బాస్ 8 ఈ సారి ముందే వ‌చ్చేస్తుంది.. పూర్తి డీటైల్స్ ఇవే..!

బిగ్ బాస్ సీజన్ 8లో కొందరు పాత కంటెస్టెంట్స్ కూడా తీసుకురాబోతున్న‌ట్టు రూమర్స్ బయటికొచ్చాయి. ఎప్పటిలాగానే బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ మాలో టెలికాస్ట్ అవుతూ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. జూన్‌లో ఈ షో ప్రారంభమవుతుంది కాబట్టి మే నుండే ఈ షోకి సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు రానున్నాయి. గ‌త సీజ‌న్ల క‌న్నా భిన్నంగా ఈ సీజ‌న్ ఉంటుంద‌ని అర్ధ‌మ‌వుతుంది. మరి ఈ సారి ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా వస్తారు, వారి మధ్య గొడవలు ఎలా ఉంటాయి అనేది బిగ్ బాస్ ల‌వ‌ర్స్ చాలా ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది