Bigg Boss 8 Telugu Nominations : బిగ్ బాస్ 8 : మొదటి వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?
ప్రధానాంశాలు:
Bigg Boss 8 Telugu Nominations : బిగ్ బాస్ 8 : మొదటి వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?
Bigg Boss 8 Telugu Nominations : బిగ్ బాస్ సీజన్ 8 అంగరంగ వైభవంగా మొదలైంది. సీజన్ 8 ని 14 మంది కంటెస్టెంట్స్ ని 7 జోడీలుగా పంపించారు నాగార్జున. ఐతే అన్ని సీజన్లలో ఫస్ట్ వీక్ నామినేషన్స్ చాలా సైలెంట్ గా జరిగేవి కానీ ఈ సీజన్ లో నామినేషన్స్ కూడా చాలా గట్టిగానే జరిగాయని అనిపిస్తుంది. మొదటి వారం అది హౌస్ లోకి వచ్చిన రెండో రోజే ఈ రేంజ్ లో నామినేషన్స్ జరిగాయంటే రాబోయే వారాల్లో కచ్చితంగా ఒక రేంజ్ లో ఉంటాయని చెప్పొచ్చు.
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు లో మొదటి వారం ఆరుగురు హౌస్ మెట్స్ నామినేషన్స్ లో ఉన్నారు. హౌస్ లో ఉన్న 14 మంది లో నిఖిల్, నైనిక, యష్మి ఈ ముగ్గురు చీఫ్ లుగా ఉన్నారు కాబట్టి నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. ఐతే మిగిలిన 11 మందిలో ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ 8 లో మొదటి వారం విష్ణు ప్రియ, శేఖర్ బాషా, మణికంఠ, పృధ్విరాజ్, సోనియా, బేబక్క నామినేషన్స్ లో ఉన్నారు.
Bigg Boss 8 Telugu Nominations మణికంఠ సింపతీ ప్లాన్..
హౌస్ లో యంగ్ బోయ్ గా కనిపిస్తున్న నాగ మణికంఠ మొదటి నుంచి ట్రిగ్గర్ అవుతూ హౌస్ మెట్స్ ఏమన్నా సరే టార్గెట్ చేస్తూ వస్తున్నాడు. ఐతే అతని లోపల చాలా ఎమోషన్ ఉందని అర్ధమవుతున్నా దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానంలో అతను సింపతీ ఆట ఆడుతున్నాడని తెలిసేలా కనిపిస్తుంది. నామినేషన్స్ టైం లో తన ఎమోషనల్ స్పీచ్ వల్ల అందరు కాస్త ఎమోషనల్ అయ్యారు. ఐతే అతను కేవలం ఆట కోసమే ఇలా చేస్తున్నాడా లేదా నిజమా అన్నది రానున్న రోజుల్లో తెలుస్తుంది.

Bigg Boss 8 Telugu Nominations : బిగ్ బాస్ 8 : మొదటి వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే..?
తన జీవితంలో అన్ని కోల్పోయా బిగ్ బాస్ తో మళ్లీ ప్రూవ్ చేసుకోవాలని చెబుతున్న మణికంఠ బాగా ఎమోషనల్ అవడంతో బిగ్ బాస్ కన్ ఫెషన్ రూం లోకి పిలిచి మాట్లాడాడు. ఐతే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న మణికంఠ హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఐతే అతను చేస్తున్న ఈ డ్రామా నిజమే అయినా కేవలం ఆడియన్స్ తనని యాక్సెప్ట్ చేయడానికే ఇలా చేస్తున్నాడని మిగతా హౌస్ మెట్స్ భావిస్తున్నారు.