Bigg Boss 8 Telugu : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8లో ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి. నామినేషన్ ప్రక్రియ ముగిసాక హౌస్ మేట్స్ డిస్కషన్స్ మొదలు పెట్టారు. ఇక యష్మీని హగ్ చేసుకొని నిఖిల్ ఎందుకు గౌతమ్ అక్కా అన్న టాపిక్ తీశావురా వేస్ట్‌గా అని అన్నాడు. దానికి యష్మీ తీయాలిరా మీరిద్దరూ ఎంత సేపు మాట్లాడారు అక్కా అనే టాపిక్ మీద.. అది బ్యాడ్‌గా వెళ్తుంది బయటికి. అంటూ సమాధానం చెప్పింది యష్మీ. దీని గురించి ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో అక్కడికి గౌతమ్ వచ్చాడు. “రేయ్ స్వాతిముత్యం మీకు అర్థం కావట్లే.. అక్కడే ఏదైతే బయట చెప్తున్నారో అదే బయట పోట్రే అవుతుంది.. మీకు అర్థం కావట్లే..” అని నిఖిల్ తో అన్నాడు గౌతమ్. దానికి యష్మీ ఎదో చెప్పింది. ఆతర్వాత నిఖిల్ జనాలు అలా అనుకుంటారు.
ఆతర్వాత విష్ణు ప్రియా దగ్గరకు వెళ్లి డిస్కషన్ పెట్టాడు నిఖిల్.. యష్మీ , గౌతమ్ దగ్గర ఒకలా మాట్లాడిన నిఖిల్.. విష్ణు దగ్గర మరోలా మాట్లాడాడు. ట్రైయాంగిల్ స్టోరీ నన్ను ఎఫెక్ట్ చేస్తుంది.. కదా.. నేను అక్కడ నిల్చొని మాట్లాడాల్సిందా లేక తప్పయిందా..బయట నా వాళ్లు ఉన్నారు నాగురించి ఏమనుకుంటారు. అంటూ విష్ణు దగ్గర చెప్పుకొచ్చాడు నిఖిల్. నేను ఓ క్లారిటీ ఇవ్వాల్సింది.. జనాలికి కూడా తెలుస్తుంది ఏంటంటే నాకు కావాల్సిన వాళ్లు బయట ఉన్నారని డైలాగ్స్ కొట్టాడు. ఇక గౌతమ్ కన్నడ బ్యాచ్‌కి చుక్కలు చూపిస్తున్నాడు. ఎవరు రెచ్చగొట్టినా తను అనుకున్న పాయింట్ చెపుతున్నాడు. ఇలానే నామినేషన్స్ లో తనను టార్గెట్ చేసిన కన్నడ బ్యాచ్ కు చుక్కలు చూపించాడు గౌతమ్.
ఈ దెబ్బకు నిఖిల్ కు ఏమీ అర్ధం కాలేదు. వాళ్లిద్దరి మధ్య తన గేమ్ పాడవుతుందని రియలైజ్ అయ్యాడు. ఆడియన్స్ లోకి రాంగ్ వెళ్తుందేమ్ అని అనుమానం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో యష్మి ఆలోచన గురించి కూడా విష్ణు ప్రియ దగ్గర ప్రస్తావించాడు. ఇక గౌతమ్ తాను నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి ఆట ఆడట తనకు ఎంతో ముఖ్యమని అంటున్నాడు. అందుకే నబిల్ తో డీల్ చేసుకుని… గెలవకపోయినా.. టాస్క్ కోసం చాలా కష్టపడ్డారు. రిస్క్ కూడా చేశారు. ఇక మెగా చీఫ్ కంటెండర్స్ కోసం బిగ్ బాస్ రకరకాల పరీక్షలు పెడుతున్నాడు. బ్రీఫ్ కేస్ గేమ్ ఆడించాడు. అందులో బిగ్ బాస్ బ్రీఫ్ కేస్ లను నబిల్, పృధ్వీ, రోహిణి తీసుకోగా.. వారు కంటెండర్స్ అయ్యారు. కాని దాన్ని నిలబెట్టుకోవడం కోసం టాస్క్ లు ఆడాల్సి ఉంటుంది. రెండు రోజులు మెగా చీఫ్ కు సబంధించిన టాస్క్ లు గట్టిగా జరిగే అవకాశం ఉంది.
Hyderabad : హైదరాబాద్‌లో ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు…
KTR : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న తెలివి తక్కువ నిర్ణయాల వల్ల తెలంగాణలో ఆదాయ క్షీణత, రియల్ ఎస్టేట్ మార్కెట్…
Kasthuri Shankar : వివాదాస్పద కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తలలో నిలిచే కస్తూరి తాజాగా మరోసారి వివాదంలో చిక్కుకుంది.ఇటీవలే ఓ ప్రసంగంలో…
Hair : ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో పేలు కూడా ఒకటి. అయితే తలలో పేలు అనేవి అధికంగా ఉండడం…
Donald Trump Life Story : న్యూయార్క్ రియల్ ఎస్టేట్ దిగ్గజం వైట్ హౌస్ అధ్యక్షుడిగా రెండోసారి పదవీ బాధ్యతలు…
US President Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ us Elections 2024 ప్రశాంతంగా సాగింది. అమెరికాకు…
Winter Season : తేనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మన అందరికీ తెలిసిందే. అలాగే ఈ తేనెను చలికాలంలో తీసుకుంటే…
Minister Seethakka : తెలంగాణా పణాయితీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అంగన్ వాడీలకు మంచి శుభవార్త చెప్పారు. అంగన్…
This website uses cookies.