Ashu Reddy : కనీసం కుక్కకి కూడా ఇంట్రెస్ట్ లేదు!.. అమ్మ పరువుతీసిన అషూ రెడ్డి

 Authored By prabhas | The Telugu News | Updated on :10 August 2022,5:40 pm

Ashu Reddy : అషూ రెడ్డి తన తల్లి మీద ఎన్ని సెటైర్లు వేస్తుంటుందో అందరికీ తెలిసిందే. అషూ రెడ్డి తన యూట్యూబ్ చానెల్‌లో చేసే వీడియోలు అందులో తన తల్లి గురించి కౌంటర్లు వేయడం అందరికీ తెలిసిందే. ఇక తన తల్లి తనను ఎలా తిడుతుంటుందో కూడా చూపిస్తుంటుంది. అషూ రెడ్డి వెకేషన్లకు వెళ్లడం, అక్కడ షాపింగ్ చేయడం, అందులో ఎక్కువగా హ్యాండ్ బ్యాగులు కొనడం, వాటిని చూసి తన తల్లి ఇచ్చే రియాక్షన్లు, తిట్టే తిట్ల గురించి చెబుతూ ఉంటుంది అషూ రెడ్డి. అషూ రెడ్డి ఓ పెట్ లవర్ అన్న సంగతి తెలిసిందే. అషూ రెడ్డికి ఇష్టమైన పెట్ ఉంది. దాని పేరు రాజుగాడు.

బిగ్ బాస్ ఇంట్లో ఉన్న సమయంలోనూ రాజుగాడు అంటూ కలవరిస్తుండేది. రాజుగాడు అంటే తనకు చాలా ఇష్టమని ఎన్నో సార్లు చెప్పింది. ఇక తాను డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఇలాంటి వ్యాపకాలన్నీ కూడా పెట్టుకున్నట్టు అనిపిస్తోంది. అషూ రెడ్డి తన లవ్ స్టోరీ, బ్రేకప్ స్టోరీ, తన ఫ్రెండే తనను ఎలా మోసం చేసిందో ఎంతో క్లియర్‌గా చెప్పిన సంగతి తెలిసిందే. అషూ రెడ్డి ఇప్పుడు మాత్రం మంచి ఫాంలో ఉంది. తన ఫ్రెండ్స్‌తో కలిసి తిరుగుతోంది. కలిసి వెకేషన్లకు వెళ్తోంది. మొన్నా మధ్య యూఎస్ వెళ్లి తన పాత ఫ్రెండ్స్ అందరినీ కలిసి వచ్చింది.

Bigg Boss Ashu Reddy Fun With Mother Cooking

Bigg Boss Ashu Reddy Fun With Mother Cooking

అక్కడే అజయ్ బర్త్ డేను బికినీ భామల మధ్య జరిపించింది.ఇక గోవాలో అజయ్, స్రవంతిలతో కలిసి అషూ రెడ్డి నానా హంగామా చేసింది. మొన్నటికి మొన్న రోహిణితో కలిసి దుబాయ్‌లో సందడి చేసింది అషూ. ఇక ఇప్పుడు తాజాగా అషూ ఓ ఫన్నీ పోస్ట్‌ను చేసింది. ఇందులో తన తల్లి చేసిన దోశల మీద కౌంటర్ వేసింది. నాకు ఆ దోశల మీద ఇంట్రెస్ట్ లేదు.. కనీసం రాజు గాడికి కూడా ఇంట్రెస్ట్ లేదు.. అంటూ నవ్వేస్తోంది. కనీసం కుక్క కూడా తినడం లేదన్నట్టుగా ఆ దోశలు, తన అమ్మ వంట పరువుతీసింది. నా వల్లే కావడం లేదు ఇదెక్కడ తింటుందన్నట్టుగా చెప్పుకొచ్చింది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి