Home » Entertainment » Bigg Boss Nonstop Bindhu Madhavi Get Super Response
Entertainment

Bigg Boss OTT Telugu : బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్ విన్నర్ ఆమె.. అప్పుడే ఫ్యాన్స్‌ సందడి షురూ

Authored By
Himanshi
The Telugu News | Published on: March 6, 2022, 1:30 pm
Advertisement

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్‌ బాస్‌ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ షోలో మాజీ కంటెస్టెంట్ లు మరియు కొత్త కంటెస్టెంట్ లు కలిసి సందడి చేస్తున్నారు. ఈ సారి బిందు మాధవి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. గతంలో ఈమె కమల్ హాసన్ హోస్టు గా వ్యవహరించిన తమిళ బిగ్‌ బాస్‌ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ నాన్‌ స్టాప్‌ కంటెస్టెంట్ గా రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.తెలుగులో ఇంతకు ముందు కంటెస్టెంట్ గా వ్యవహరించిన వారు కాకుండా వేరే భాష కంటెస్టెంట్ కూడా తీసుకు రావడం ప్రత్యేకత. మొన్నటి వరకు బిందు మాధవి గురించి పెద్దగా చర్చ జరగలేదు

Advertisement

కానీ అనూహ్యంగా ఆమె గురించిన చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది. ఇతర సభ్యులతో పోలిస్తే సైలెంట్ గా తన పని తాను చేసుకు పోతుంది. ఆ పద్ధతి ఇప్పుడు అందరికీ నచ్చుతుంది. దాంతో సోషల్ మీడియాలో ఆమె గురించి పెద్ద ఎత్తున పాజిటివ్ చర్చలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఆమె విజేతగా నిలిచే అవకాశాలు లేకపోలేదు అంటూ చర్చ వినిపిస్తుంది.తెలుగు బిగ్ బాస్ లో మొదటి లేడీ విన్నర్ అంటూ అప్పుడే చర్చ మొదలు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు పడటం తో పాటు సమయానుసారంగా వ్యవహరించడం కూడా తెలిసి ఉండాలి. ఆ విషయంలో బిందు మాధవి పర్ఫెక్ట్ గా వ్యవహరిస్తున్నారంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss Nonstop bindhu madhavi get super response

Advertisement

తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవి తెలుగు భాషలోనే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే హీరోయిన్ గా ఆమెకు స్టార్డమ్ మాత్రం దక్కలేదు. కానీ సుదీర్ఘ కాలం పాటు నటిగా కొనసాగిన ఘనత ఆమెకు దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడికి సినిమా లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు అవుతుందేమో చూడాలి. మొదటి వారంలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో పలువురు పెట్టిన సర్వేలో బిందు మాధవి కి మెజారిటీ ఓట్లు దక్కాయి. ఆ తర్వాత అఖిల్‌ మరియు అరియానా లు నిలిచారు.

Himanshi

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి