Bigg Boss OTT Telugu : బిగ్‌ బాస్‌ నాన్‌స్టాప్ విన్నర్ ఆమె.. అప్పుడే ఫ్యాన్స్‌ సందడి షురూ

Authored By Himanshi | The Telugu News | Published on: March 6, 2022, 1:30 pm

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్‌ బాస్‌ నాన్ స్టాప్ స్ట్రీమింగ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ షోలో మాజీ కంటెస్టెంట్ లు మరియు కొత్త కంటెస్టెంట్ లు కలిసి సందడి చేస్తున్నారు. ఈ సారి బిందు మాధవి ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. గతంలో ఈమె కమల్ హాసన్ హోస్టు గా వ్యవహరించిన తమిళ బిగ్‌ బాస్‌ సీజన్ వన్ లో కంటెస్టెంట్ గా ఉన్నారు. మళ్లీ ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ నాన్‌ స్టాప్‌ కంటెస్టెంట్ గా రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.తెలుగులో ఇంతకు ముందు కంటెస్టెంట్ గా వ్యవహరించిన వారు కాకుండా వేరే భాష కంటెస్టెంట్ కూడా తీసుకు రావడం ప్రత్యేకత. మొన్నటి వరకు బిందు మాధవి గురించి పెద్దగా చర్చ జరగలేదు

కానీ అనూహ్యంగా ఆమె గురించిన చర్చ సోషల్‌ మీడియాలో మొదలైంది. ఇతర సభ్యులతో పోలిస్తే సైలెంట్ గా తన పని తాను చేసుకు పోతుంది. ఆ పద్ధతి ఇప్పుడు అందరికీ నచ్చుతుంది. దాంతో సోషల్ మీడియాలో ఆమె గురించి పెద్ద ఎత్తున పాజిటివ్ చర్చలు మొదలయ్యాయి. అంతే కాకుండా ఆమె విజేతగా నిలిచే అవకాశాలు లేకపోలేదు అంటూ చర్చ వినిపిస్తుంది.తెలుగు బిగ్ బాస్ లో మొదటి లేడీ విన్నర్ అంటూ అప్పుడే చర్చ మొదలు పెట్టారు. బిగ్ బాస్ హౌస్ లో గొడవలు పడటం తో పాటు సమయానుసారంగా వ్యవహరించడం కూడా తెలిసి ఉండాలి. ఆ విషయంలో బిందు మాధవి పర్ఫెక్ట్ గా వ్యవహరిస్తున్నారంటూ ఆమె అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Bigg Boss Nonstop bindhu madhavi get super response

Bigg Boss Nonstop bindhu madhavi get super response

తెలుగు అమ్మాయి అయిన బిందు మాధవి తెలుగు భాషలోనే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే హీరోయిన్ గా ఆమెకు స్టార్డమ్ మాత్రం దక్కలేదు. కానీ సుదీర్ఘ కాలం పాటు నటిగా కొనసాగిన ఘనత ఆమెకు దక్కుతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు బిగ్ బాస్ తో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అమ్మడికి సినిమా లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు అవుతుందేమో చూడాలి. మొదటి వారంలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు అంటూ సోషల్ మీడియాలో పలువురు పెట్టిన సర్వేలో బిందు మాధవి కి మెజారిటీ ఓట్లు దక్కాయి. ఆ తర్వాత అఖిల్‌ మరియు అరియానా లు నిలిచారు.

Himanshi

No bio available for this author.

  1. "TDP YSRCP Janasena : టీడీపీ, వైసీపీ, జనసేనలో ఒకటే సమస్య.. అధిష్ఠానాలకు కొత్త స‌వాళ్లు..!"

  2. "US Green Card New Rules : అమెరికాలో ఉండే ఇండియ‌న్స్ కు బిగ్‌న్యూస్‌.. గ్రీన్ కార్డ్ కొత్త‌ రూల్స్ ఇవే..!"

  3. "VS Babu Passes Away : బ్రేకింగ్ న్యూస్‌.. విజయ్ పార్టీలో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత..!"

  4. "Telangana : గుడ్‌న్యూస్.. తెలంగాణలో కొత్త పింఛన్ల తేదీ ఖరారు.. మీ ఖాతాలో డబ్బులు ఎప్పుడు పడతాయంటే?"

  5. "UPI MDR Charges : ఫోన్‌పే, గూగుల్ పే వాడేవారికి గుడ్‌న్యూస్‌.. MDR ఛార్జీలు వారికి మినహాయింపు..?"

  6. "Jabardasth : జబర్దస్త్‌లోకి కెవ్వు కార్తీక్ రీఎంట్రీ.. రోహిణి ఏజ్‌పై రష్మి సెటైర్లు..!"

  7. "Ramya krishnan : రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. సౌందర్యతో పోటీ, ఆ పాత్ర వెనుక అసలు కథ..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp