Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ నాన్ స్టాప్.. ఓర్నీ మీదుంప తెగ.. షో మొత్తం మొదటి వారంలోనే చూపిస్తున్నారుగా!
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ ప్రారంభం అయ్యి ఇంకా ఒక్క వారం కూడా కాలేదు. అప్పుడే ప్రేక్షకులకు బోర్ కొట్టిందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు కూడా సోది ముచ్చట్లు.. చిల్లర పంచాయితీలు చేస్తున్నారు. అదే సమయంలో వారు ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విషయమై ఆలోచించకుండా కెమెరా ముందు ఎలా ప్రొజెక్ట్ అవ్వాలి అనేది మాత్రమే చూసుకుంటున్నారు. ప్రేక్షకులు ఏమాత్రం సంతృప్తిగా లేరు అని గ్రహించిన నిర్వాహకులు గొడవ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.కంటెస్టెంట్స్ గొడవ పడుతున్న సమయంలో ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అనేది వారి అభిప్రాయం.
కానీ గొడవలు పెట్టడం కోసం నిర్వాహకులు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ కూడా ఏమాత్రం ఫలించడం లేదు. మొదటి వారంలోనే షోఇంత దారుణంగా ఉంటే వచ్చే వచ్చే వారాల్లో మరింత దారుణంగా ఉంటుందేమో అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున మొదటి వీకెండు ఎపిసోడ్ సందర్భంగా కంటెస్టెంట్స్ తో ఏం మాట్లాడబోతున్నారు.. వారికి ఏ విధమైన సూచనలు ఇవ్వబోతున్నాడు అనేది అందరికీ ఆసక్తిగా మారింది.ప్రేక్షకులు ఎంటర్ టైన్మెంట్ కోరుకుంటున్నారు. కనుక మీరు ఆ దిశగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అంటూ నాగార్జున సూచించే అవకాశాలు ఉన్నాయి. మరో వైపు కొందర్ని టార్గెట్ చేసి నాగార్జున తిట్టే అవకాశాలు కూడా ఉన్నాయి.

bigg boss OTT Telugu audience feeling after first week
ఎందుకంటే వారు కనీసం ప్రదర్శన ఇవ్వడం లేదని టాక్. వారికి భారీగా పారితోషికం ఇవ్వాల్సి వస్తుంది అందుకే వారితో కంటెంట్ రాబట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సరయు నుండి ఆమె స్థాయి కంటెంట్ రావడం లేదు అని కామెంట్ లు ఉన్నాయి. అందుకే ఆమెను మరో సారి మందలించే అవకాశాలు కూడా లేకపోలేదు. సరయు గత సీజన్లో మొదటి వారంలోనే ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఈసారి మాత్రం అలా జరగదు అని అంటున్నారు. షో ముందు ముందు ఇంకా చాలా ఉంది కనుక జాగ్రత్తగా ప్లాన్ చేస్తే బాగుంటుంది అని అభిప్రాయం వ్యక్తమవుతోంది.
bigg boss OTT Telugu audience feeling after first week