Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. ఆ రెండు విషయాలు లాక్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Bigg Boss Telugu OTT : బిగ్ బాస్ ఓటీటీ తెలుగు ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌.. ఆ రెండు విషయాలు లాక్‌

Bigg Boss Telugu OTT : తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 5 ముగిసిన వెంటనే ఓటీటీ బిగ్ బాస్ ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరిలో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టబోతున్నట్లుగా హాట్ స్టార్ వారు అధికారికంగా ప్రకటించారు. హాట్‌ స్టార్‌ లో బిగ్ బాస్ ను స్ట్రీమింగ్‌ చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హాట్ స్టార్ కు మంచి క్రేజ్ ఉంటుంది. కనుక అత్యధికులు ఈ […]

 Authored By himanshi | The Telugu News | Updated on :25 January 2022,12:00 pm

Bigg Boss Telugu OTT : తెలుగు బిగ్ బాస్‌ సీజన్‌ 5 ముగిసిన వెంటనే ఓటీటీ బిగ్ బాస్ ఏర్పాట్లు ప్రారంభం అయ్యాయి. ఫిబ్రవరిలో బిగ్ బాస్ తెలుగు ఓటీటీ ని ప్రయోగాత్మకంగా మొదలు పెట్టబోతున్నట్లుగా హాట్ స్టార్ వారు అధికారికంగా ప్రకటించారు. హాట్‌ స్టార్‌ లో బిగ్ బాస్ ను స్ట్రీమింగ్‌ చేయబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హాట్ స్టార్ కు మంచి క్రేజ్ ఉంటుంది. కనుక అత్యధికులు ఈ బిగ్ బాస్ ను చూస్తారనే నమ్మకం వ్యక్తం అవుతోంది. తెలుగు ఓటీటీ షో లకు దక్కుతున్న ఆధరణ నేపథ్యంలో బిగ్‌ బాస్ ఓటీటీకి కూడా మంచి ఆధరణ లభిస్తుందనే నమ్మకం తో ప్రతి ఒక్కరు ఉన్నారు. ఈ సమయంలో బిగ్‌ బాస్‌ ఓటీటీ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్‌ అప్డేట్‌ వచ్చింది.

అన్నపూర్ణ స్టూడియో లో సెట్‌ నిర్మాణం పూర్తి అయ్యిందట. తక్కువ మంది కంటెస్టెంట్స్ మరియు తక్కువ రోజులు కనుక గత సెట్‌ తో పోల్చితే ఈసారి సెట్‌ చాలా చిన్నగా ఉంటుందట. అంతే కాకుండా ఇప్పటి వరకు జరిగిన సీజన్‌ ల సెట్‌ లతో పోల్చితే ఈ సెట్‌ పూర్తి విరుద్దంగా ఉంటుందట. అసలు రెండు ఒక్కటేనా అన్నట్లుగా ఉండేలా సెట్ వేసినట్లుగా తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక్కరు ఇద్దరు ప్రముఖులతో పాటు సోషల్‌ మీడియా సెన్షేషన్స్.. బుల్లి తెర స్టార్స్ ను ఈ షో కోసం ఎంపిక చేయడం జరిగింది. ఆ జాబితా ఇప్పటికే షో నిర్వహాకులు నాగార్జున వద్దకు తీసుకు వెళ్లినట్లుగా తెలుస్తోంది.బిగ్ బాస్‌ ను ఫిబ్రవరిలో స్ట్రీమింగ్ మొదలు పెట్టబోతున్నట్లుగా నాగార్జున మరియు నిర్వాహకులు

Bigg Boss OTT Telugu Interesting Update

Bigg Boss OTT Telugu Interesting Update

Bigg Boss Telugu OTT : బిగ్‌బాస్‌ షో ప్రారంభం మార్పు లేదు..

ప్రకటించినట్లుగానే ఖచ్చితంగా అదే తేదీకి స్ట్రీమింగ్ మొదలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే రెగ్యులర్‌ బిగ్ బాస్ కంటే చాలా విభిన్నంగా లో బడ్జెట్ తో ఈ బిగ్ బాస్ ఓటీటీ ఉంటుందని అంటున్నారు. తెలుగు బిగ్‌ బాస్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కనుక ఓటీటీ వర్షన్ కూడా ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరిలో స్ట్రీమింగ్‌ మొదలు పెట్టడం కోసం డేట్ ను లాక్ చేయడం మాత్రమే కాకుండా కంటెస్టెంట్స్ వివరాలను కూడా లాక్ చేయడం జరిగింది. షో కు భారీగా రేటింగ్‌ వస్తుందనే నమ్మకంతో ఉన్నారు. నాగార్జున హోస్ట్‌ గా వ్యవహరించబోతున్నాడు. ఓంకార్‌ ప్రోగ్రామ్‌ ప్రొడ్యూసర్ గా వ్యవహరించబోతున్నట్లుగా తెలుస్తోంది.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది