Bigg Boss OTT Telugu : అఖిల్ తో లవ్ ట్రాక్‌ నడిపి అషు రెడ్డి సేవ్‌ అవ్వాలనుకుంటుందా?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: March 25, 2022, 11:00 am

Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్బాస్ నాన్ స్టాప్ మెల్ల మెల్లగా ప్రేక్షకులను అలరిస్తూ ఆదరణ సొంతం చేసుకుంటుంది. మొదట ఈ షో గురించి జనాలు నెగటివ్ గా మాట్లాడుకున్నా… ఇప్పుడు మాత్రం పాజిటివ్ దిశ గా మాట్లాడుకుంటూ షో కి సపోర్ట్ చేస్తున్నారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ బిగ్ బాస్ కి సంబంధించిన లవ్ ట్రాక్ కూడా నడుస్తున్నాయి. బిగ్బాస్ అంటే లవ్ ట్రాక్ అనేది సాధారణ విషయం. గతంలో వచ్చిన పలు సీజన్లో కూడా లవ్ ట్రాక్ నడిచాయి. ఆ లవ్ ట్రాక్ ల వల్లే షో ఇంట్రెస్ట్ గా సాగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే ఈ సీజన్లో కూడా కావాలని లవ్‌ ట్రాక్‌ పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మరోవైపు కొన్ని లవ్ ట్రాక్‌ లు ఆటోమేటిక్ గా పుట్టుకొస్తున్నాయి. అందులో ప్రధానమైనది అఖిల్‌ మరియు అషు రెడ్డి. వీరిద్దరూ ప్రస్తుతం చాలా క్లోజ్ అవుతున్నారు. ఒకరి గురించి ఒకరు చాలా ఫీలవుతున్నారు. ఒకరు బాధ పడితే మరొకరు బాధపడుతూ ఒకరి గురించి ఇంకొకరు ఎక్కువగా ఆలోచిస్తూ అలుగుతూ కోప్పడుతూ రకరకాలుగా నిజమైన ప్రేమికుల మాదిరిగా ఎమోషన్స్ ని చూపిస్తున్నారు. వీరిద్దరికీ సంబంధించిన సన్నివేశాలు ప్రస్తుతం బిగ్బాస్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.తాజా ఎపిసోడ్ లో అషు రెడ్డి ఒక విషయానికి ఫీల్ అయ్యి అఖిల్ తనకు ఇచ్చిన బ్రాస్‌ లెట్ ని వెనక్కి ఇచ్చేస్తోంది. దాంతో అఖిల్ బాధపడతాడు.

Akhil and ashu reddy love track in Bigg Boss OTT Telugu nonstop

Akhil and ashu reddy love track in Bigg Boss OTT Telugu nonstop

ఆ తర్వాత స్కిట్ లో భాగంగా నిన్ను ప్రేమిస్తున్నాను.. నీవు నాకు చాలా ప్రత్యేకం అంటూ చెప్పి ఆ బ్రాస్లెట్ ని మళ్లీ ఆమెకు ఇచ్చేశాడు. ఆ సమయంలో అషు రెడ్డి తెగ మెలికలు తిరుగుతూ అతని ప్రేమను అంగీకరించినట్లుగా అనిపించింది. అసలు విషయం ఏంటో కానీ ఈ షో కోసం మాత్రం అఖిల్ తో ప్రేమలో ఉన్నట్లు గా అషు రెడ్డి వ్యవహరిస్తుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో అఖిల్‌ మరియు మోనాల్ ప్రేమ వ్యవహారం కారణంగా ఇద్దరు కూడా చాలా దూరం ప్రయాణించారు. అఖిల ఏకంగా రన్నరప్ గా నిలిచాడు ఇప్పుడు అఖిల్ తో కలిసి షో లో లవ్‌ ట్రాక్‌ నడపడం వల్ల అషు రెడ్డి కచ్చితంగా మంచి మైలేజ్ ని సొంతం చేసుకుంటారు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Samsung Galaxy S25 Ultra : అబ్బా ఏం ఆఫర్.. రూ.1.30 లక్షల ఫోన్ రూ.50 వేలకే?.. ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్..!"

  2. "Gold Price Crash : బంగారం ధరలు భారీగా తగ్గినా కొనడానికి వెనుకడుగు.. అసలు 5 కారణాలు ఇవే!"

  3. "8th Pay Commission : కేంద్ర ఉద్యోగులకు డబుల్ గుడ్‌న్యూస్ ? రూ.18 వేల జీతం రూ.65 వేలకు వ‌ర‌కు పెరిగే చాన్స్‌?"

  4. "Peerzadiguda Pulse Polio : పీర్జాదిగూడలో పోలియో చుక్కలు .. ప్రతి చిన్నారికి రక్షణ కల్పించాలి: తవిటి ప్రశాంత్ కుమార్"

  5. "IND A vs PAK A : పాక్ బ్యాటర్‌తో హర్షిత్ రాణా మాటల యుద్ధం.. మైదానంలో హైడ్రామా!"

  6. "Chengicherla Indiramma Illu : చెంగిచెర్ల ఎస్సీ బస్తీలో ఇందిరమ్మ ఇంటి ప్రారంభం.. తోటకూర అజయ్ యాదవ్"

  7. "Bigg Boss Telugu 10 : బిగ్‌బాస్ 10లో ఊహించని ట్విస్ట్.. 11వ వారంలో మరో ఎలిమినేషన్ ఉంటుందా?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp