Bigg Boss OTT Telugu : ఒరేయ్ బిగ్ బాస్ గా.. నీకు ఇదేం పోయే కాలంరా బాబు!
Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ లో ప్రతి ఎలిమినేషన్ నామినేషన్ ఎపిసోడ్ కూడా రచ్చ రచ్చ అన్నట్లుగా సాగుతోంది. ప్రతి సోమవారం ప్రేక్షకులకు మస్త్ ఎంటర్ టైన్మెంట్ ను ఇస్తున్నారు. ఇదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా తిట్టుకునే విధంగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది. సోమవారం మరియు మంగళవారం నామినేషన్ పక్రియ చాలా విభిన్నంగా సాగింది. ఒకొక్క ఇంటి సభ్యులు ఏకంగా ముగ్గురు అర్హత లేని వారిని బయటకు పంపేందుకు నామినేషన్ లో ఉంచాలని ఇచ్చారు.
అది చాలా మూర్ఖమైన టాస్క్ అంటూ విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి దుర్మార్ఘమైన నీచమైన టాస్క్ లు ఎలా ఆలోచిస్తున్న బిగ్ బాస్ అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ రెచ్చగొడితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ మరింతగా రెచ్చి పోతున్నారు. వారు వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. బాబోయ్ మరీ ఇంత అతి ఏంట్రా నాయన అంటూ ప్రతి ఒక్కరు కూడా విమర్శలు చేసే విధంగా ఉన్నాయి. తెలుగు బిగ్ బాస్ స్టార్ మా లో ప్రసారం అయ్యే సమయంలో మరీ ఇంతగా హడావుడి లేదు.
ప్రతి కంటెస్టెంట్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ లో నటరాజ్ మాస్టర్ వ్యవహరిస్తున్న తీరు సబ్య సమాజం తల దించుకునేలా వ్యవహరిస్తుంది. బిందు మాధవిని ఆయన విమర్శిస్తున్న తీరు కు తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అలాంటి విమర్శలను ఎడిట్ చేసే అవకాశం ఉంది. అయినా కూడా ఎవరు ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. సూర్పణక అంటూ బిందు మాధవిని విమర్శించిన తీరు ఏ ఒక్కరికి నచ్చడం లేదు. అయినా కూడా బిగ్ బాస్ రేటింగ్ కోసం ఆయన్ను ఉంచుతున్నట్లుగా అనిపిస్తుంది. బిగ్ బాస్ ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా జనాల ఆసక్తి ని కోల్పోవడం ఖాయం అంటున్నారు.