Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ లో గత సీజన్ కంటెస్టెంట్స్ ఎంట్రీ… వారి పారితోషికం తెలిస్తే షాక్‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Bigg Boss OTT Telugu : బిగ్ బాస్ లో గత సీజన్ కంటెస్టెంట్స్ ఎంట్రీ… వారి పారితోషికం తెలిస్తే షాక్‌

 Authored By prabhas | The Telugu News | Updated on :7 May 2022,8:30 pm

Bigg Boss OTT Telugu : బిగ్‌ బాస్ తెలుగు నాన్ స్టాప్‌ ఓటీటీ ముగింపు దశకు వచ్చింది. స్టార్‌ మా లో టెలికాస్ట్ అయిన సమయంలో బిగ్‌ బాస్ కు ఎలా అయితే ఆధరణ దక్కిందో ఆ స్థాయి లో కాకున్నా కాస్త పర్వాలేదు అన్నట్లుగానే బిగ్‌ బాస్ నాన్ స్టాప్ కు ఆధరణ దక్ఇకంది. త్వరలో రెగ్యులర్ బిగ్‌ బాస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సీజన్ ను ముగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో రెండు వారాల్లో షో కు తెర వేయబోతున్నారు.ఎప్పటిలాగే ఈ సీజన్ లో కూడా గత సీజన్ ల కంటెస్టెంట్స్ చివరి వారంలో వచ్చి సందడి చేస్తున్నారు. ఈ వారం మొత్తం కూడా వరుసగా గత సీజన్ కంటెస్టెంట్స్‌ సందడి చేస్తున్నారు.

గత సీజన్‌ రన్నర్ గా నిలిచిన షన్నూ ఇంకా మానస్‌, సిరిలు తాజాగా బిగ్‌ బాస్‌ హౌస్ లోకి అడుగు పెట్టారు. నేటి ఎపిసోడ్‌ లో విన్నర్‌ వీజే సన్నీ సందడి చేయబోతున్నాడు. సన్నీ అంటే ఎంటర్‌ టైన్మెంట్‌ పీక్స్ లో ఉంటుందని మరోసారి నిరూపించాడు.బిగ్‌ బాస్ నాన్ స్టాప్ లో ఈ మాజీ కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడంతో ప్రధాన ఆకర్షణగా ఉంది. అయితే వారు ఏమీ సరదాకు ఊరికే రాలేదు. ఒకొక్కరికి భారీ పారితోషికంను ఇవ్వడం జరిగిందట. యాంకర్‌ రవితో పాటు ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క స్టార్‌ డమ్‌ అనుసారంగా రోజు వారి పారితోషికం ను ఇవ్వడం జరిగిందట.

Bigg Boss OTT Telugu nonstop old contestants remuneration news

Bigg Boss OTT Telugu nonstop old contestants remuneration news

విశ్వసనంగా అందుతున్న సమాచారం ప్రకారం మానస్‌, సిరి లకు రెండున్నర లక్షల పారితోషికం ఇచ్చారట.యాంకర్ రవి మూడున్నర లక్షల వరకు తీసుకున్నాడు.షన్నూ కూడా మూడు లక్షల పారితోషికం తీసుకోగా విన్నర్‌ అయిన సన్నీ నాలుగు లక్షల వరకు పారితోషికం అందుకున్నాడట. గత సీజన్ వారు ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తదుపరి సీజన్ లో కనిపించాల్సి ఉంటుంది. కనుక వారు కాదనకుండా తక్కువ పారితోషికం అయినా వచ్చారని సమాచారం.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది